ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు ఉద్యోగాలు డీట్ ద్వారా...

ABN, First Publish Date - 2020-08-12T00:46:37+05:30

ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన డిజిటల్ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్(www.tsdeet.com) వెబ్‌సైట్ సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద : ప్రైవేటు రంగంలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ దృష్టి సారించిన విషయం తెలిసిందే. గత సంవత్సరం ప్రవేశ పెట్టిన డిజిటల్ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్(www.tsdeet.com) వెబ్‌సైట్ సహకారంతో ఉపాధి కల్పన దిశగా చర్యలు తీసుకుంటున్నారు.


ఫిబ్రవరి నెలాఖరు వరకు 8.07 లక్షల మంది నిరుద్యోగులు... తెలంగాణ ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 7,25,898 గా ఉందని కార్మిక ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ నీరజా రెడ్డి వెల్లడించారు. అయితే... ఈ సంఖ్య ఆధారంగా నిరుదోగ్యుల సంఖ్య తగ్గిందని తేల్చలేమని వివరించారు నీరజా రెడ్డి.


‘కరోనావైరస్ కారణంగా చాలా మంది తమ కార్డులను పునరుద్ధరించి ఉండరు. నిరుద్యోగుల సంఖ్యపై సమగ్ర విశ్లేషణ చేసేందుకు సమయం పట్టొచ్చు’ అని ఆమె వివరించారు. ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన నిరుద్యోగులకు డీట్ సాయంతో ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగావకాశాల సమాచారాన్నందిస్తున్నారు. దీనిపై ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్ డైరెక్టర్ కె.వై. నాయక్ మాట్లాడుతూ... ‘గతంలో ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజ్‌లో ఉద్యోగ మేళాలు నిర్వహించేవాళ్లం. ఇప్పుడు డీట్ సాయంతో ఉద్యోగ ఖాళీలకు తగిన అర్హులను గుర్తించి భర్తీ చేస్తున్నాం’అని వెల్లడించారు. 


Updated Date - 2020-08-12T00:46:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising