ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీశైలం పవర్‌హౌస్‌ పునరుద్ధరణపై గోప్యత!

ABN, First Publish Date - 2020-10-22T07:03:36+05:30

శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్‌ ద్వారా జల విద్యుత్తు ఉత్పత్తిని పునరుద్ధరించే అంశంలో అధికార యంత్రాంగం గోప్యతను ప్రదర్శిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేడు జల విద్యుదుత్పత్తి ప్రారంభించే అవకాశం

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్‌ ద్వారా జల విద్యుత్తు ఉత్పత్తిని పునరుద్ధరించే అంశంలో అధికార యంత్రాంగం గోప్యతను ప్రదర్శిస్తోంది. ఆగస్టు 20న పవర్‌హౌ్‌సలో పేలుళ్లు సంభవించి దాదాపు 900 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పాదనకు విఘాతం ఏర్పడింది. ఒకటి, రెండవ యూనిట్లలో ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, వాటిని 20 రోజుల వ్యవధిలో పునరుద్ధరిస్తామని మంత్రులు, జెన్‌కో, ఎస్‌సీడీసీఎల్‌ అధికారులు అప్పుడు ప్రకటించారు.


అయితే ఇదిగో అదిగో అంటూ ఊరించడం తప్ప విద్యుత్తు ఉత్పాదనలో తాత్సారం జరగడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వానాకాలంలో ప్రాజెక్టుల కింద జల విద్యుత్తు ఉత్పాదన చేసి ఖర్చును తగ్గించుకోవడం సర్వసాధారణం కాగా శ్రీశైలం ఎడమగట్టు పవర్‌హౌ్‌సలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది. సమృద్ధిగా నీళ్లుండి 10 గేట్లు 8సార్లు తెరవడం ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నప్పటికీ జలవిద్యుత్తుశక్తికి వినియోగించుకోవడంలో జెన్‌కో విఫలమైనట్లు విమర్శలున్నాయి.


ఈనేపథ్యంలో శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌హౌస్‌లోని ఒకటి, రెండు యూనిట్ల ద్వారా గురువారం లాంఛనప్రాయంగా విద్యుత్తు ఉత్పాదన ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జెన్‌కోకు చెందిన ఉన్నతాధికారులు పవర్‌హౌస్‌ ప్రాంగణంలో దుర్గామాతకు పూజలు కూడా చేయడం గమనార్హం. 


Updated Date - 2020-10-22T07:03:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising