ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజామాబాద్: కానిస్టేబుల్‌ను కొట్టి రివాల్వార్‌తో ఖైదీ పరారీ

ABN, First Publish Date - 2020-04-05T16:53:18+05:30

నిజామాబాద్‌ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ అనే రిమాండ్‌ ఖైదీ పరారయ్యాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ : జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ అనే రిమాండ్‌ ఖైదీ పరారయ్యాడు. నిజామాబాద్ గౌతంనగర్‌కు చెందిన ప్రసాద్ దొంగతనం కేసులో రిమాండ్‌ విధించారు. అయితే అనారోగ్యం కారణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేసిన ఆ ఖైదీ శనివారం రాత్రి విధుల్లో ఉన్న ఎస్కార్ట్ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. 


అనంతరం ఆ కానిస్టేబుల్ దగ్గరున్న రివాల్వర్ లాక్కొని పరారయ్యాడు. ఈ సమాచారాన్ని కానిస్టేబుల్‌ పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి చెప్పగా రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్ కోసం గాలిస్తున్నారు. లాక్‌డౌన్ ఉండటంతో ఆ ఖైదీ ఎక్కడికీ పోలేడని వీలైనంత త్వరగానే ప్రసాద్‌ను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-05T16:53:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising