ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్ట్రెయిన్‌ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం

ABN, First Publish Date - 2020-12-30T08:08:20+05:30

కరోనా కొత్త స్ట్రెయిన్‌ ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతీ, టిమ్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసొలేషన్‌కు ఏర్పాట్లు


హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త స్ట్రెయిన్‌ ను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతీ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 130 పడకలతో ఐసీయూ వార్డును సిద్ధం చేశారు. ఆక్సిజన్‌, వెంటిలేషన్‌ సదుపాయం కల్పించారు. కొత్త స్ట్రెయిన్‌ బాధితులకు వైద్యం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు ఛాతీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌ తెలిపారు. ఇక్కడ ఐసీయూ సదుపాయలతో 123 పడకలు ఏర్పాటు చేశారు. పరిస్థితిని బట్టి మరో వంద మం దికి ఆక్సిజన్‌ ఆధారిత వైద్యం అందించనున్నారు. మరోవైపు అవసరమైనవారిని టిమ్స్‌కు తరలించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఫీవర్‌ ఆస్పత్రిలో కూడా ఆక్సిజన్‌తో పడకలను సిద్ధం చేసి ఉంచారు. స్ట్రెయిన్‌ రోగుల ఐసోలేషన్‌కు అమీర్‌పేట నేచర్‌క్యూర్‌ ఆస్పత్రిని కూడా సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.  


కరోనా వైరస్‌ చికిత్సనే: గాంధీ సూపరింటెండెంట్‌

కొత్త స్ట్రెయిన్‌ బాధితులకు దాదాపు కరోనా పాజిటివ్‌లకు అందించినట్లే వైద్యం అందే అవకాశం ఉందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. కొత్త స్ట్రెయిన్‌ తీవ్రత శరీరంలో ఎన్ని రోజుల పాటు ఉంటుందో నిర్ధారణ ద్వారా తేలుతుందని, పరిస్థితులకు అనుగుణంగా ఆస్పత్రుల్లో ఉంచే అవకాశం ఉంటుందన్నారు. 

Updated Date - 2020-12-30T08:08:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising