ప్రేమ వ్యవహారంలో యువకుడి హత్య
ABN, First Publish Date - 2020-10-21T09:33:57+05:30
తన చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపాడు ఓ అన్న. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం..
వీణవంక, అక్టోబరు 20: తన చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపాడు ఓ అన్న. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన నరుకుడు ప్రణయ్(23) అదే గ్రామంలోని తమ సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాడు. దీంతో ఆమె అన్న నద్దునూరి అనిల్ తన ప్రణయ్‌ని పలుమార్లు మందలించాడు. అయినా ప్రణయ్‌లో మార్పు లేకపోవడంతో.. సోమవారం రాత్రి మాట్లాడే పని ఉందని అనిల్.. ప్రణయ్‌ను గ్రామంలోని అంబేద్కర్ భవనం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మరో ముగ్గురితో కలిసి ప్రణయ్‌ను గొడ్డలి, కత్తులతో నరికి చంపారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Updated Date - 2020-10-21T09:33:57+05:30 IST