ఓరుగల్లు ప్రతిభావంతులకు నిలయం
ABN, First Publish Date - 2020-09-14T10:58:16+05:30
ఓరుగల్లు వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన ఎందరికో నిలయం అని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు, జిల్లా ఐక్య వేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, జూనియర్
ఎంపీ దయాకర్
వరంగల్ కల్చరల్, సెప్టెంబరు 13: ఓరుగల్లు వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన ఎందరికో నిలయం అని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ప్రముఖ రంగస్థల నటుడు, జిల్లా ఐక్య వేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య, జూనియర్ ఘంటసాలగా ఖ్యాతి గడించిన గుజ్జారి రమేష్, ప్రముఖ మైమ్ కళాకారుడు కళాధర్, ప్రముఖ సాహితీ వేత్త, ప్రసారిక సాహిత్య పత్రిక సంపాదకుడు నమిలికొండ బాలకిషన్‌రావులకు గౌరవ డాక్టరేట్లు లభించడం అభినందనీయం అన్నారు.
గ్లోబల్ పీస్ యూనివర్సిటీ చెన్నై వారు స్థానిక శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష సేవలిందించినందుకు వీరికి గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశారు. ఆదివారం హంటర్‌రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ జరిగిన ఈ కార్యక్రమంలో గ్లోబల్ పీస్ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ పి.మానులవ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దయాకర్, మేయర్ ప్రకాశ్‌రావును ఘనంగా సత్కరించారు.
Updated Date - 2020-09-14T10:58:16+05:30 IST