ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నార్తులకు బాసటగా.. పోలీసు శాఖ వాట్సాప్‌ గ్రూప్‌

ABN, First Publish Date - 2020-04-03T07:10:21+05:30

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నార్తులకు బాసటగా నిలిచేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. పస్తులుంటున్న వలస కార్మికులు, పేదలకు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

94906 17523 నెంబరు కేటాయింపు

సామాజిక సేవలో ట్రైనీ ఐపీఎస్‌లు

మహమ్మారిని ఓడిద్దాం: డీజీపీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నార్తులకు బాసటగా నిలిచేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. పస్తులుంటున్న వలస కార్మికులు, పేదలకు భోజన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం వాట్సాప్‌ నంబరు (94906 17523)ను కేటాయించి, ప్రత్యేకంగా ఓ గ్రూపును నిర్వహిస్తోంది. ఎక్కడైనా ఆకలితో అల్లాడుతున్న పేదలు కనిపిస్తే.. పోలీసులు ఆ వాట్సాప్‌ గ్రూప్‌లో వివరాలు పెడతారు. అందులో ఉన్న ఆపన్నులు/స్వచ్ఛంద సంస్థలు వారు చెప్పిన ప్రదేశానికి చేరుకుని, రేషన్‌/భోజనం అందజేస్తాయి. ఆసక్తిగల స్వచ్ఛంద సంస్థలు తమ వాట్సాప్‌ నంబరుకు మెసేజ్‌ చేసి, వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా.. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ట్రైనీ ఐపీఎ్‌సలు మేముసైతం అంటూ ముందుకు వచ్చారు. ఎన్పీయేలో శిక్షణ పొందుతున్న 170 మంది ట్రైనీ ఐపీఎ్‌సలు రూ.1.75 లక్షలతో పేదలకు నిత్యావసర వస్తువులను సమకూర్చారు. మరోవైపు.. కరోనా మహమ్మారిని ఓడించేందుకు అంతా భాగస్వాములవ్వాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ను విజయవంతం చేసి, పోలీసులకు సహకరించాలని కోరారు. కాగా.. పోలీసులకు మార్చినెల జీతాన్ని ఎలాంటి కోతలేకుండా విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో కరోనా కట్టడిలో తమ బాధ్యత మరింత పెరిగిందని ఆయన అన్నారు.

Updated Date - 2020-04-03T07:10:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising