ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్ చెప్పినా మీడియా ప్రతినిధులపై అదే తీరు..

ABN, First Publish Date - 2020-03-25T03:25:26+05:30

మీడియా ప్రతినిధుల విధులకు భంగం కలిగించొద్దని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి గంట కూడా కాలేదు ఆయన మాటను పోలీసులు తుంగలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మీడియా ప్రతినిధుల విధులకు భంగం కలిగించొద్దని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి గంట కూడా కాలేదు ఆయన మాటను పోలీసులు తుంగలో తొక్కేస్తున్నారు. మీడియా సిబ్బందిపై పోలీసుల తీరు మారడం లేదు. విధులు ముగించుకుని వెళ్తున్న మీడియా ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ సిబ్బంది సెకండ్ షిఫ్ట్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఐడీ కార్డులు చూపిస్తున్నా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పలు చోట్ల దాడులకు దిగుతున్నారు. సోమవారం రామంతాపూర్‌లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. తాజాగా దిల్‌సుక్‌నగర్, శేరిలింగంపల్లిలో జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియా ప్రతినిధులను అడ్డుకోవద్దని సీఎం కేసీఆర్ సాక్షాత్తు చెప్పినా పోలీసుల ఓవరాక్షన్ మాత్రం తగ్గలేదు. ఈ ఘటనలను జర్నలిస్టుల సంఘం నేతలు ఖండించారు. ఇలాంటి ఘటనలపై ఇప్పటికే డీజీపీకి వినతిపత్రం అందజేశారు. మరోసారి డీజీపీని కలుస్తామని జర్నలిస్టు సంఘం నేతలు చెప్పారు. 

Updated Date - 2020-03-25T03:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising