ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు సంస్కరణల అమలేదీ?

ABN, First Publish Date - 2020-09-28T10:28:45+05:30

పోలీసు సంస్కరణల అమలేదీ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెక్యూరిటీ కమిషన్‌ ఏర్పాటే లేదు

సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు

సీహెచ్‌ఆర్‌ఐ నివేదికలో వెల్లడి


హైదరాబాద్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసు సంస్కరణలను సరిగా అమలుచేయడం లేదని కామన్‌వెల్త్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఇనిషియేటివ్‌(సీహెచ్‌ఆర్‌ఐ) నివేదిక  వెల్లడించింది. తెలంగాణ, ఒడిసా మినహా మిగతా రాష్ట్రాలన్నీ స్టేట్‌ సెక్యూరిటీ కమిషన్‌లను ఏర్పాటు చేశాయని పేర్కొంది. పోలీసు సంస్కరణలపై సుప్రీంకోర్టు జారీ చేసిన ఏడు ఆదేశాల అమలుపై సీహెచ్‌ఆర్‌ఐ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. పోలీసు విధి నిర్వహణలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగదని, రాష్ట్రాలు తమ పోలీసింగ్‌పై నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలనే ఆదేశాలను తెలంగాణ పోలీసు శాఖ అమలుచేయడం లేదని పేర్కొంది. డీజీపీ కనీస పదవీకాలం రెండేళ్లు ఉండేలా.. ఆయన ఎంపిక మెరిట్‌ ప్రాతిపదికన జరపాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోగా.. అనేక సందర్భాల్లో అతిక్రమిస్తున్నారని వివరించింది. పోలీసుల పనితీరును ఆడిటింగ్‌ చేస్తూ.. వృత్తిపర నైపుణ్యానికి పదునుపెట్టేందుకు పెద్దపీట వేయాలని చెబుతున్నా.. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. పోలీసు అధికారులపై వచ్చే ఫిర్యాదులను పరిశీలిచేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ప్రత్యేక మండళ్లను ఏర్పాటునూ విస్మరించిందని వివరించింది. తెలంగాణలో పోలీసు చట్టాన్ని రూపొందించలేదని, మిగతా రాష్ట్రాల్లో కొత్త చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తుచేసింది. జిల్లా ఎస్పీలు, స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌(ఎ్‌సహెచ్‌వో)లను కనిష్ఠంగా రెండేళ్లు ఒకే స్థానంలో విధులు నిర్వహించాలనే నిబంధన కూడా రాష్ట్రంలో అమలవ్వడం లేదని తెలిపింది. బదిలీలు, పదోన్నతుల కోసం డీఎస్పీ, ఆ పైర్యాంకు అధికారులకు రాష్ట్రస్థాయిలో.. డీఎస్పీలోపు ర్యాంకు అధికారులకు జిల్లాస్థాయిలో ఎస్టాబ్లి్‌షమెంట్‌ బోర్డులను ఏర్పాటు చేయలేదని పేర్కొంది.

Updated Date - 2020-09-28T10:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising