ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం

ABN, First Publish Date - 2020-07-11T08:39:31+05:30

పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిగులు జలాల పంపిణీ తేలే వరకు వద్దు

గోదావరి బోర్డుకు టీఎస్‌ సర్కారు లేఖ


హైదరాబాద్‌, జులై 10 (ఆంధ్రజ్యోతి): పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు ప్రతిపాదనను అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డుకు ఇరిగేషన్‌ శాఖ ఈఎన్‌ సీ మురళీధర్‌రావు లేఖ రాశారు. పోలవరం కుడి కాలువ సామర్థ్యాన్ని 17,633 క్యూసెక్కుల నుంచి 50 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తన లేఖలో ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా ఏడాదికి సుమారు 300 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు తరలించడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసిందని, ఈ నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించే అవకాశం ఉందని చెప్పారు.


గోదావరి బేసిన్‌లోని మిగులు జలాల పంపిణీపై తుది నిర్ణయం తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం ఇలా నీటిని మళ్లించడం ద్వారా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. మిగులు జాలాల పంపిణీ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ఇలాంటి ప్రాజెక్టును చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రతిపాదించిన పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపును అడ్డుకోవాలని బోర్డుకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2020-07-11T08:39:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising