ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సంపేటలో ఘనంగా పోచమ్మ బోనాలు

ABN, First Publish Date - 2020-08-03T10:51:12+05:30

నర్సంపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సంపేట, ఆగస్టు 2 : నర్సంపేట పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు పోచమ్మ బోనాలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అనేక వార్డులకు చెందిన మహిళలు బోనాలను నెత్తిన ఎత్తుకొని పట్టణంలోని వరంగల్‌రోడ్‌లో గల పోచమ్మదేవాలయం వద్దకు చేరుకున్నారు.


పోచమ్మ తల్లిని క్యూ పద్ధతిలో వెళ్లి తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  10వ వార్డు కౌన్సిలర్‌ నాగిశెట్టిపద్మప్రసాద్‌ దంపతులతో పాటు పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు పోచమ్మ ఆలయంలో పూజలు చేశారు. పోచమ్మతల్లీ పిల్లా,పాపలను, కుటుంబ సభ్యులను చల్లంగ చూడు అంటూ వేడుకున్నారు. బోనాలతో తరలివచ్చిన మహిళలతో పోచమ్మ దేవాలయం సందడిగా మారింది.


తిమ్మంపేటలో బోనాల పండుగ

దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేటలో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా భౌతిక దూరం పాటించాలని, ఇళ్ల నందే జరుపుకోవాలని గ్రామ పంచాయతీ వారు  నిబంధనలు పెట్టడంతో ఇళ్లలోనే మొక్కులు తీర్చుకున్నారు. 

Updated Date - 2020-08-03T10:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising