ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని సహాయనిధి పేరుతో నకిలీ యూపీఐలు

ABN, First Publish Date - 2020-04-06T12:32:15+05:30

కరోనా విపత్తు సమయంలో ప్రధాని సహాయనిధికి ఇచ్చే విరాళాలను కొల్లగొట్టేందుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేసులు నమోదు చేసిన సైబర్‌ క్రైం సిబ్బంది
  • తేడాలు గమనించాలంటున్న సైబర్‌ క్రైం పోలీసులు

హైదరాబాద్‌ : కరోనా విపత్తు సమయంలో ప్రధాని సహాయనిధికి ఇచ్చే విరాళాలను కొల్లగొట్టేందుకు పలువురు సైబర్‌ నేరగాళ్లు ప్రధాని సహాయనిధి నకిలీ యూపీఐలను సృష్టించినట్లుగా గుర్తించిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. ప్రధానమంత్రి సిటిజన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిట్చ్యువేషన్స్‌ ఫండ్‌(పీఎం సీఏఆర్‌ఈఎస్‌ఫండ్‌) సరైన యూపీఐ pmcares@sbi. కానీ కొందరు ఈ నిధికి వచ్చే డబ్బులు కాజేసేందుకు నకిలీ యూపీఐలను సృష్టించారు.


వివిధ బ్యాంకుల పేర్లు జతచేయడం ద్వారా pmcares@pnb, pmcares@hdfcbank, pmcares@yesbank, pmcares@upi, pmcares@sbi, pmcares@icici వంటి నకిలీ ఐడీలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసి విరాళాలు కోరుతున్నారు. ఈ తరహా నకిలీ యూపీఐలను సైబర్‌ క్రైం విభాగం గుర్తించిందని, ఆయా యూపీఐలు సృష్టించిన వారిపై కేసులు నమోదు చేశామని సైబర్‌ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు. పీఎం సహాయనిధికి విరాళాలు ఇవ్వాలనుకునే వారు తప్పనిసరిగా అసలు యూపీఐ ఏదో, నకిలీ యూపీఐ ఏదో గుర్తించి విరాళాలు అందించాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-04-06T12:32:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising