ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ

ABN, First Publish Date - 2020-02-17T21:32:04+05:30

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కేసీఆర్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. అలాగే జగన్, మేఘాలయ సీఎం సంగ్మా ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్ ద్వారా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు కేసీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలు ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పగా... ఎప్పుడూ సీఎం కేసీఆర్ నిండు ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.


హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నేతలు కేక్ కట్ చేశారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు మొక్కలు నాటారు. తర్వాత కేక్ కట్ చేశారు. తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో తల్లినికన్నతనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేయగా.. కేటీఆర్ కుమారుడు హిమాన్షు.. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Updated Date - 2020-02-17T21:32:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising