ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరు జోక్యం చేసుకోండి..

ABN, First Publish Date - 2020-05-18T09:19:32+05:30

మీరు జోక్యం చేసుకోండి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): వైద్య, దంతవైద్య పీజీ సీట్ల ఫీజులు పెంచిన విషయంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జోక్యం చేసుకోవాలని  జూనియర్‌ డాక్టర్ల సంఘం, హెల్త్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు చీఫ్‌ జస్టి్‌సకు ఆదివారం వేర్వేరుగా లేఖలు రాశాయి. ఫీజుల పెంపును ఆపేయాలని జూనియర్‌ డాక్టర్లు ఇటీవల హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజెస్‌ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎ్‌ఫఆర్‌సీ)ని ప్రతివాదులుగా పేర్కొన్న ఈ పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఎ్‌స.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన డివిజనల్‌ బెంచ్‌ విచారించింది. ఫీజుల పెంపు కోరుతూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు చూపిన కారణాలను, టీఏఎ్‌ఫఆర్‌సీ సమావేశ వివరాలను సమర్పించాలని బెంచ్‌ టీఏఎ్‌ఫఆర్‌సీ తరఫు లాయర్‌ను ఆదేశించింది. టీఏఎ్‌ఫఆర్‌సీ వివరాలు సమర్పింలేదు. దీంతో ఆదివారం విచారణ వాయిదా పడిందని, కేసును మరో బెంచ్‌కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సుప్రీం సీజేకు రాసిన లేఖలో జూనియర్‌ డాక్టర్లు పేర్కొన్నారు. ఈనెల 18తో డెంటల్‌ పీజీ, 20వ తేదీతో మెడికల్‌ పీజీ కన్వీనర్‌ కోటా అడ్మిషన్లు ముగుస్తాయని, ఈలోపే విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2020-05-18T09:19:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising