ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలంటే సదాశివయ్యకు ప్రాణం

ABN, First Publish Date - 2020-07-18T07:52:43+05:30

మొక్కల పెంపకమంటే ఆయనకు మక్కువ. అదే ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు దక్కేలా చేసింది. అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఏదైనా చేయాలన్న సంకల్పం తో తెలంగాణ నమూనాలో గార్డెన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి మనసు చూరగొన్నారు అధ్యాపకుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్చర్ల/మహబూబ్‌నగర్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మొక్కల పెంపకమంటే ఆయనకు మక్కువ. అదే ఇప్పుడు సీఎం కేసీఆర్‌ ప్రశంసలు దక్కేలా చేసింది. అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఏదైనా చేయాలన్న సంకల్పం తో తెలంగాణ నమూనాలో గార్డెన్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి మనసు చూరగొన్నారు అధ్యాపకుడు సదాశివయ్య. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల డిగ్రీ కాలేజీలో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న ఆయన.. మొదటి నుంచి మొక్కలపై పలు పరిశోధన లు చేశారు. రాత్రి మాత్రమే వికసించే మొక్కను గు ర్తించి దానికి ప్యాన్‌ క్రాసియం తెలంగాణైగా పేరు పె ట్టారు. నల్లమలఅడవుల్లో పరిశోధన నిర్వహించి కర్కు మా భ్రమరాంబై మొక్కను కనుగొన్నారు. వనపర్తిలోని తిరుమలయ్యగుట్ట అటవీప్రాంతంలో 467మొక్కల జా తులున్నట్లు  గుర్తించారు. సంబంధిత మొక్కల వద్దకు తీసుకెళ్లి పాఠాలు చెబితే.. విద్యార్థులకు బాగా అర్థమవుతుందనేది సదాశివయ్య భావన. అందులో భాగంగానే పలు వినూత్న కార్యక్రమాలకు ఆయన  శ్రీకారం చుట్టారు. గతంలో వనపర్తి డిగ్రీ కాలేజీలో పని చేసినప్పుడు మూడున్నర ఎకరాల్లో 3,500 మొక్కలు నాటించారు. తన వద్దకు గెజిటెడ్‌ సంతకం కోసం వచ్చే వారు.. కచ్చితంగా ఒక మొక్కను ఇప్పించాలనే నిబంధన పెడతారు. అలాగే, పుట్టిన రోజు వేడుకలు చేసుకు నే వారు మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తున్నారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీకి వచ్చిన తర్వాత ‘‘ప్రకృతికి రూపాయి’’ పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పర్యావరణ ప్రి యుల నుంచి ఏడాదికి రూ.365 చొప్పున విరాళాలు సేకరించి 30 గుంటల స్థలంలో 800 మొక్కలు నాటించారు. తెలంగాణ నమూనాతో బొటానికల్‌ గార్డెన్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ నమూనాలో 33 జిల్లాల సరిహద్దులు ఉండేలా ఇటుకలతో మార్కింగ్‌ చేసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. 


సీఎంకు అరుదైన మొక్క అందజేత

నల్లమలలో మినహా మరెక్కడా లభ్యం కాని ఆండ్రోగ్రాఫిస్‌ నల్లమలయాన అనే అరుదైన మొక్కను సీఎం కు  సదాశివయ్య అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డి,  ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డితో కలిసి సీఎంను కలిశారు.

Updated Date - 2020-07-18T07:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising