ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయండి : కేంద్రానికి వ్యవసాయ మంత్రి ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2020-03-16T21:06:52+05:30

రాష్ట్రానికి సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రతిపాదనలు పంపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రాష్ట్రానికి సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రతిపాదనలు పంపించారు.

 కాళేశ్వరం ఎత్తిపోతలతోపాటు ఇతరత్రా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తితో వ్యవసాయానికి సమృద్దిగా సాగునీరు అందుతోందని, మొత్తం తెలంగాణలో 25 మేజర్, 12 మీడియం ప్రాజెక్టులున్నాయని, మిషన్ కాకతీయతో 46 వేల చెరువులు, కుంటలను పునరుద్దరించడంతో కోటి ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ వైపు సాగుతున్నామని... ఈ నేపధ్యంలో రాష్ట్రానికి పరిశోధనా కేంద్రాలు అవసరమని మంత్రి తన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 


ఉత్తర తెలంగాణలో ప్రముఖంగా పండించే ఆవాల పంట ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచేందుకు అనువైన ప్రాంతమైన జగిత్యాలలో పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేసి నూతన వంగడాలు, అనువైన సాగు పద్దతులు కనుగొనడానికి రైతులకు మేలు జరిగేలా సహకరించాలని కోరారు. 


తెలంగాణలో సాగునీరు పూర్తిగా అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో భూగర్భజలం పెరిగి వాతావరణ పరిస్థితులు మారాయని, ఈ క్రమంలో... తాగునీరు, సాగునీరు కలిసిపోయి కలుషితం కాకుండా సాగునీటి యాజమాన్యం సమర్ధంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఈ పరిస్థితులను గుర్తించి సాగునీటి యాజమాన్య పరిశోధనా కేంద్రం, ఆవాల పరిశోధనా కేంద్రాలను మంజూరు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

రు

Updated Date - 2020-03-16T21:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising