ప్రజలందరి కడుపులు నింపుతాం: కేసీఆర్
ABN, First Publish Date - 2020-03-27T22:30:44+05:30
రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల ప్రజల కడుపులు నింపుతామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దయచేసి ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. ఇది పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఎస్సారెస్పీ
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాల ప్రజల కడుపులు నింపుతామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. దయచేసి ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. ఇది పంటలు చేతికొచ్చే సమయం కాబట్టి ఎస్సారెస్పీ, కాళేశ్వరం కింద నీళ్లు ఇవ్వాలన్నారు. ఏప్రిల్ 10 వరకు పంటలకు నీటి సరఫరా ఆపొద్దని కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ను అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల వారికి ఇబ్బందులు కలగొద్దని, జిల్లా కలెక్టర్లు వారికి భోజన సదుపాయం కల్పించాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు 9 కార్పొరేషన్లలో ఇతర రాష్ట్రాల కార్మికులు అధికంగా ఉన్నారని తెలిపారు. వైద్యులకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని, ఐసోలేషన్ వార్డుల్లో 11 వేల మందికి పడకలు సిద్ధం చేస్తున్నామని, 1400 ఐసీయూ బెడ్లను కూడా సిద్ధం చేశామని కేసీఆర్ తెలిపారు.
Updated Date - 2020-03-27T22:30:44+05:30 IST