ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి నెల లబ్ధిదారులు పింఛన్‌ తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-12T05:05:16+05:30

ప్రతి నెల లబ్ధిదారులు పింఛన్‌ తీసుకోవాలి

దీక్షకుంటలో పింఛన్ల పంపిణీని పరిశీలిస్తున్న జిల్లా అధికారి పరమాత్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెక్కొండ, డిసెంబరు 11: వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను లబ్ధిదారులు తప్పకుండా తీసుకోవాలని జిల్లా పింఛన్‌ విభాగం అధికారి ఎ.పరమాత్మ అన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం పింఛన్ల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. గతంలో ఒకటి, రెండు నెలలు తీసుకోని లబ్ధిదారులకు మూడో నెలలో పంపిణీ చేసే అవకాశం ఉండగా, ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దుపర్చినట్లు తెలిపారు. ఒక నెల తీసుకోని లబ్ధిదారుల పింఛన్‌ రద్దవుతుందన్నారు. ఈ విషయాన్ని అధికారులు లబ్ధిదారులకు తెలపడంతో పాటు గ్రామాల్లో ప్రతి నెల వంద శాతం బీపీఎంలు పంపిణీ చేయాలన్నారు. మరణించిన పింఛన్‌దారుల వివరాలను వెంటనే జిల్లా అధికారులకు తెలపాలని అన్నారు. కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ పుట్టపాక అరుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:05:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising