పెద్దపల్లి జిల్లాలో ఆకతాయిల హల్‌చల్
ABN, First Publish Date - 2020-05-09T17:41:33+05:30
పెద్దపల్లి జిల్లాలో ఆకతాయిల హల్‌చల్
పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో ఆకతాయిలు హల్‌చల్ చేస్తున్నారు. పలుకాలనీల్లో ఇంటి ముందు నిలిపి ఉన్న కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు అయిదు కార్ల అద్దాలను ఆకతాయిలు పగులగొట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత రెండు రోజులుగా ఆకతాయిలు పలు కాలనీల్లో సంచరిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2020-05-09T17:41:33+05:30 IST