ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబస్తీ మజ్లిస్‌ కంచుకోటే!

ABN, First Publish Date - 2020-12-05T09:20:54+05:30

మజ్లిస్‌ పార్టీకి హైదరాబాద్‌ పాతబస్తీ ఇప్పటికీ కంచుకోటే. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 44 సీట్లు సాధించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ పార్టీకి హైదరాబాద్‌ పాతబస్తీ ఇప్పటికీ కంచుకోటే. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 44 సీట్లు సాధించిన ఎంఐఎం ఈసారి కూడా చెక్కు చెదరని ఓటు బ్యాంకుతో అన్నే స్థానాలు దక్కించుకుంది. గత ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థి మహ్మద్‌ గౌస్‌ వల్ల కోల్పోయిన ఘాన్సీబజార్‌ సీటును బీజేపీ నుంచి కైవసం చేసుకుంది. గౌస్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకొని ఆయన భార్య పర్వీన్‌ సుల్తానాకు టికెట్‌ ఇవ్వడంతో అక్కడ విజయం సునాయాసమైంది. అదే సందర్భంలో గోషామహల్‌ నియోజక వర్గంలోని జాంబాగ్‌ను బీజేపీకి కోల్పోయింది.


గత ఎన్నికల్లో 60 డివిజన్లలో పోటీ చేసిన మజ్లిస్‌ పార్టీ ఈసారి వ్యూహాత్మకంగా 51 స్థానాల్లోనే అభ్యర్థులను నిలిపింది. ఫలితంగా మైనారిటీల ఓట్లు చీల్చకుండా టీఆర్‌ఎ్‌సకు మేలు చేసిందని ఫలితాల సరళిని పరిశీలిస్తే స్పష్టమవుతోంది. మజ్లిస్‌ పార్టీ వదులుకున్న 9 డివిజన్లకు ఆరింటిలో టీఆర్‌ఎస్‌ నెగ్గింది.  


Updated Date - 2020-12-05T09:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising