ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్న కొడుకును కడసారి చూసుకునేందుకు..తల్లిదండ్రుల ఎదురుచూపులు

ABN, First Publish Date - 2020-12-29T08:33:10+05:30

కన్నపేగు తల్లడిల్లుతోంది.. కన్నీటి పర్యంతమవుతోంది.. ఆరు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన తమ ఒక్కగానొక్క కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి (26)ని కడసారి కళ్లారా చూసుకునే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరు రోజుల క్రితం అమెరికాలో మృతిచెందిన చంద్రపాల్‌రెడ్డి 


మహబూబాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : కన్నపేగు తల్లడిల్లుతోంది.. కన్నీటి పర్యంతమవుతోంది.. ఆరు రోజుల క్రితం అమెరికాలో గుండెపోటుతో మృతిచెందిన తమ ఒక్కగానొక్క కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి (26)ని కడసారి కళ్లారా చూసుకునే అవకాశాన్ని కల్పించాలని తల్లిదండ్రులు గొట్టం శ్రీనివా్‌సరెడ్డి-శోభారాణి సీఎం కేసీఆర్‌ను కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయ దంపతులు గొట్టం శ్రీనివా్‌సరెడ్డి-శోభారాణిల కుమారుడు గొట్టం చంద్రపాల్‌రెడ్డి. ఆయన బీటెక్‌ చేసిన అనంతరం 2016లో అమెరికాలోని టెక్సా్‌సలో ఎంఎస్‌ పూర్తిచేశారు. అనంతరం ఓ వైపు పీహెచ్‌డీ చేస్తూనే.. మరోవైపు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చంద్రపాల్‌రెడ్డికి ఇటీవల మరో కంపెనీలో ఉద్యోగం రావడంతో.. ఈనెల 22న రాత్రి స్నేహితులకు విందు ఇచ్చారు. అనంతరం అక్కడి నివాసానికి తిరిగి వెళ్తుండగా తీవ్ర అస్వస్థతతో కుప్పకూలారు. ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈవిషయం చంద్రపాల్‌రెడ్డి తల్లిదండ్రులకు తెలియడంతో.. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లి సమీప బంధువు ఇంట్లో ఉంటూ తమ కుమారుడి మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు. 

Updated Date - 2020-12-29T08:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising