ఆదిలాబాద్ జిల్లాలో కరప్రతాల కలకలం
ABN, First Publish Date - 2020-10-04T02:46:58+05:30
మావోయిస్టులకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేసిన కరపత్రాలు జిల్లాలో కలకలం రేపాయి...
ఆదిలాబాద్: మావోయిస్టులకు వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు విడుదల చేసిన కరపత్రాలు జిల్లాలో కలకలం రేపాయి. బోథ్ మండలం పొచ్చేర, సోనాలలో కరపత్రాలు వెలిశాయి. మావోయిస్టు నేత భాస్కర్ అక్రమ వసూళ్లు చేస్తున్నారని, అరాచకాలు ఆపాలని కరపత్రాల్లో పేర్కొన్నారు.
మరోవైపు మావోయిస్టుల కోసం పోలీసులు డేగకన్ను వేశారు. ఆసిఫాబాద్ జిల్లాలోని కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోల కీలక నేత భాస్కర్ అలియాస్ అడేళ్లు తప్పించుకున్నాడని భావిస్తున్న పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. ప్రాణహిత తీరం వెంట తలదాచుకొనే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక బలగాలు గస్తీ తిరుగుతున్నాయి. డ్రోన్ కెమెరాల సహాయంతో అనువణువునా గాలిస్తున్నాయి.
Updated Date - 2020-10-04T02:46:58+05:30 IST