ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఠాణా.. సమస్యలతో హైరానా

ABN, First Publish Date - 2020-10-30T17:16:15+05:30

2018లో దేశంలోనే నెంబర్‌ టూ.. ప్రస్తుతం అధ్వానంగా మారింది పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌. ఈ ఠాణాలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. దీంతో ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకులు, పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే లక్షలాది రూపాయలతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : 2018లో దేశంలోనే నెంబర్‌ టూ.. ప్రస్తుతం అధ్వానంగా మారింది పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌. ఈ ఠాణాలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. దీంతో ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులు, సందర్శకులు, పోలీసు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవలే లక్షలాది రూపాయలతో పోలీ్‌సస్టేషన్‌ను ఆధునికీకరించారు. అది కాస్తా మూణ్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రస్తుతం ఠాణా గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల్లో ఉన్న మరుగుదొడ్లు నిర్వహణ లోపంతో కంపుకొడుతున్నాయి. అసలే కొవిడ్‌ నేపథ్యంలో ప్రజలు పోలీ్‌సస్టేషన్‌కు రావడానికే ఇబ్బందులు పడుతున్నారు. అతి కష్టంతో ఠాణాకు వస్తే ఇక్కడ పరిస్థితులు మరింత అధ్వానంగా ఉన్నాయి. ఠాణా ఎంట్రన్స్‌లోనే వచ్చే వారికి జ్వరం ఉందో లేదో తనిఖీ చేయాల్సి ఉంది. కానీ ఇక్కడ ఎవరూ అందుబాటులో లేరు. కనీసం చేతులకు రాసుకునేందుకు శానిటైజర్‌ కూడా లేదు. హెల్ప్‌డె్‌్‌స్కలోనూ ఎవరూ అందుబాటులో ఉండడంలేదు. మొదటి అంతస్తులో సెక్షన్‌ జమేదార్‌ వద్ద మాత్రమే శానిటైజర్‌ అందుబాటులో ఉంది. ఎవరైనా వయోవృద్ధులు అత్యవసరంగా మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తే దానికి తలుపులు ఉండవు. నీటి వసతి కూడా లేదు. దీంతో దుర్వాసన వెదజల్లు తోంది. రెండవ అంతస్తులోని క్రైమ్‌ విభాగంలో కొద్దిరోజుల క్రితం జరిగిన విద్యుదాఘాతంతో దీపాలు కాలిపోయాయి. అదేవిధంగా మూడో అంతస్తులో సీసీటీవీ ఫు టేజీలు నమోదు చేసే మానిటర్లు కూడా కాలిపోయా యి. దీంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు.  


త్వరలోనే మరమ్మతులు

పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. త్వరలోనే మరమ్మతు లు చేపట్టి, దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఠాణాను నిలుపు తాం.

-నిరంజన్‌ రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌

Updated Date - 2020-10-30T17:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising