శభాష్ ‘పల్లెబ్రదర్స్’
ABN, First Publish Date - 2020-03-27T11:08:46+05:30
కరోనా కాలంలో ప్రజలకు చేయూతనందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు ఇద్దరు సోదరులు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లికిచెందిన పల్లె ఆనంద్‌కుమార్, పల్లె
గ్రామంలో ఉచితంగా నిత్యావసరాల పంపిణీ
కేశంపేట: కరోనా కాలంలో ప్రజలకు చేయూతనందిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు ఇద్దరు సోదరులు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లికిచెందిన పల్లె ఆనంద్‌కుమార్, పల్లె బాలీశ్వర్.. లాక్‌డౌన్ నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా గ్రామస్థులకు అండగా నిలుస్తున్నారు. స్థానికంగా ‘పల్లెబ్రదర్స్’గా గుర్తింపుపొందిన వీళ్లు.. నిత్యావసర సరుకుల కిట్‌ను గురువారం గ్రామంలోని ప్రతి ఇంటికీ సరఫరా చేశారు. ఈ కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ చొప్పున పప్పు, వంటనూనె, ఉల్లిపాయలతో పాటు 13 రకాల నిత్యావసర సరుకులు ఉన్నాయి. ఇందుకుగాను మొత్తం 4 లక్షల రూపాయలు ఖర్చయ్యాయని ఈ బ్రదర్స్ తెలిపారు. ఆపత్కాలంలో అండగా నిలిచిన పల్లెబ్రదర్స్.. అందరికీ ఆదర్శప్రాయులని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
Updated Date - 2020-03-27T11:08:46+05:30 IST