ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్లెల అభివృద్ధి లక్ష్యంగా పల్లె ప్రగతి

ABN, First Publish Date - 2020-07-14T00:06:58+05:30

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేస్తోందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: పల్లెల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం అమలు చేస్తోందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా అన్నారు. సోమవారం నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం జువ్విగూడెం గ్రామంలో కట్టంగూర్‌ మండలం సామనగుంట్ల గ్రామంలో పల్లె ప్రగతి పనులను జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ముందుగా నార్కట్‌పల్లి గ్రామంలో రహదారులకిరువైపుల అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలను పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠదామం, పక్కనే పూర్తి చేసిన కంపోస్ట్‌ షెడ్‌ను పరిశీలించారు. గ్రామంలో చెత్తసేకరణ జరిపిన తర్వాత కంపోస్ట్‌కు  తీసుకు వచ్చిన తర్వాత తడిపొడి చెత్తప్లాస్టిక్‌ సీసంను చెత్త నుంచి వేరు చేయాలని అన్నారు.


పంచాయితీ కార్యదర్శులకు చెత్తవేరు చేయడం పై ట్రైనింగ్‌ ఇవ్వాలని అన్నారు. చెత ్తనుంచి వేరు చేసిన ప్లాస్టిక్‌ను పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌అధికారులకు అమ్మితే వారు పిఎంజిఎస్‌వై కింద రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్‌ను 10శాతం వినియోగిస్తారని, గ్రామ పంచాయితీకి ఆదాయం కూడా వస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి వనం కోసం గుర్తించిన స్థలం పరిశీలించి మొక్కలు నాటారు. పల్లె ప్రగతి వనంలో వాకింగ్‌ ట్రాక్‌, మొక్కలు నాటే విధానం గురించి సూచనలు చేశారు. 


తర్వాత కట్టంగూర్‌ మండలం సామనగుంట్ల గ్రామంలో పల్లె ప్రగతి వనం పక్కనే రైతు వేదిక నిర్మాణం స్థలం పరిశలించి అధికారలుకు సూచనలు చేశారు. గ్రామంలో మురికి కాల్వపరిశీలించి చెత్త తొలగించక పోవడం చూసి పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శేఖర్‌రెడ్డి, డిపిఓ విష్ణువర్దన్‌, జెడ్పీ సీఈఓ వీర బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T00:06:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising