ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విహార యాత్రలో విషాదం

ABN, First Publish Date - 2020-12-21T04:13:16+05:30

విహార యాత్రలో విషాదం

వికాస్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకాల చెరువులో ఈతకు వెళ్లి యువకుడి మృతి

ఖానాపురం, డిసెంబరు 20: స్నేహితుల విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. పాకాల సరస్సులో ఈతకు వెళ్లి ఓ యువకుడు నీట మునిగి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం. వరంగల్‌ అర్బన్‌ జిల్లా అబ్బనికుంటకు చెందిన నాగిరెడ్డి  కుమార్‌కు కుమారుడు, కూతురు ఉన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా, వికాస్‌(19) ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ పూర్తిచేశాడు. ఆదివారం  మధ్యాహ్నం వికాస్‌ అబ్బనికుంటకు చెందిన తన మిత్రులతో కలిసి మొత్తం ఏడుగురు కారులో పాకాల సరస్సుకు విహార యాత్రకు వచ్చారు. గిరకతాటి చెట్ల సమీపంలో విందు భోజనాలు చేసి, మద్యం సేవించారు. అనంతరం ఈత కొట్టడానికి కాల్వలోకి దిగారు. ఈక్రమంలో వికాస్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్సై సాయిబాబు అక్కడికి చేరుకుని జాలర్ల సాయంతో తెప్పల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. మూడుగంటల గాలింపు అనంతరం వికాస్‌ మృతదేహం లభించింది. 

Updated Date - 2020-12-21T04:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising