ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్బన్‌లోనూ ఔట్‌!

ABN, First Publish Date - 2020-12-05T08:23:54+05:30

కాంగ్రెస్‌ ఖాతాలో మరో ఓటమి నమోదైంది. గతంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్నే కైవసం చేసుకున్న పార్టీ.. తాజాగా రెండు స్థానాలతో సరిపెట్టుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు డివిజన్లతో కాంగ్రెస్‌ సరి

హైదారబాద్‌, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఖాతాలో మరో ఓటమి నమోదైంది. గతంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ పీఠాన్నే కైవసం చేసుకున్న పార్టీ.. తాజాగా రెండు స్థానాలతో సరిపెట్టుకుంది. దుబ్బాక ఉప ఎన్నికలో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న కాంగ్రెస్‌ పార్టీకి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభవం ప్రమాదకరమైన సంకేతంగా మారింది. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎ్‌సకే పట్టం కట్టినా కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను కట్టబెట్టారు.


2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 సీట్లు గెలుచుకుంది. కానీ, 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనమవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయింది. అనేక మంది పార్టీ నేతలూ టీఆర్‌ఎ్‌సలో చేరిపోయారు. తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున గెలిచిన ప్రజాప్రతినిధులూ పెద్ద ఎత్తున టీఆర్‌ఎ్‌సలోకి ఫిరాయించారు. అయినా కాంగ్రెస్‌ నాయకత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించినా అధికార పార్టీలోకి ఫిరాయిస్తారన్న ప్రచారం జరిగింది.


రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న కృషికి ఈ పరిణామాలు సానుకూలంగా మారాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీపై సాధించిన విజయం కాషాయ దళానికి మంచి ఊపునిచ్చింది. ఆ వెంటనే వచ్చిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అదే జోరును కొనసాగించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కొల్లగొడుతున్న కాంగ్రె్‌సకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బ్రేక్‌ పడింది. అటు ప్రచారంలోను, ఇటు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడలోనూ టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌.. తాజాగా రెండు స్థానాలకే పరిమితమైంది.


2016లోనూ రెండు డివిజన్లలోనే గెలవడం గమనార్హం. మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఎంపీ రేవంత్‌రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పార్టీ గెలిచిన రెండు డివిజన్లూ అక్కడివే. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికే కాంగ్రె్‌సకు ఆశాకిరణంగా కనిపిస్తోంది.  


Updated Date - 2020-12-05T08:23:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising