ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒట్టేస్తే 2000

ABN, First Publish Date - 2020-11-03T07:31:54+05:30

ఒట్టేసి ఓకే చెప్పిన ఓటరుకు రూ.2000. ఒట్టేయకుండా ఓటేస్తానన్న ఓటరుకు రూ.1000! దుబ్బాక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒట్టేయకపోతే 1000.. దుబ్బాకలో ఓ పార్టీ పంపిణీ

ఓటుకు 500 ఇచ్చిన 2 పార్టీలు.. జోరుగా మద్యం

 

సిద్దిపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఒట్టేసి ఓకే చెప్పిన ఓటరుకు రూ.2000. ఒట్టేయకుండా ఓటేస్తానన్న ఓటరుకు రూ.1000! దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటుకు ఓ పార్టీ కట్టిన రేటు ఇది. దుబ్బాక ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, గెలిస్తే.. గెలవాలి.. లేదంటే రెండో స్థానాన్నైనా నిలబెట్టుకోవాలని ఓ పార్టీ రూటు మార్చింది. మిగతా పార్టీలు కూడా డబ్బు, మద్యం పంపిణీ చేస్తాయని భావించి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.


తటస్థ ఓటర్లపై గురిపెట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కుల సంఘాలకు తాయిలాలు పంచింది. క్షేత్రస్థాయిలో మోహరించిన ఆ పార్టీ బడా నేతలంతా తమ అనుభవాలను రంగరించారు. తమ స్కెచ్‌ సక్సెస్‌ అయితే గెలుపు రేసులో ఉంటామని, లేదంటే  రెండో స్థానం ఖాయమంటున్నారు. ప్రజల్లో నాలుగు రోజుల కిందటి వరకూ ఆ పార్టీ గురించి చర్చ కూడా లేదు.

కానీ, ఇప్పుడు ఆ పార్టీ గెలుపు గడప దాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదనే చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే పంచడంతో గెలుపుపై ఆ పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రెండు పార్టీలూ ఓటుకు 500 చొప్పున పంచాయి! ఫుల్లుగా మద్యాన్ని సరఫరా చేశాయి.  


Updated Date - 2020-11-03T07:31:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising