ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓపెన్‌ మార్కెట్‌ నుంచి 2 వేల కోట్ల రుణం!

ABN, First Publish Date - 2020-04-10T06:38:36+05:30

ఓపెన్‌ మార్కెట్‌ నుంచి ఈ నెలలో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తీసుకునే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రభుత్వ నిర్ణయం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఓపెన్‌ మార్కెట్‌ నుంచి ఈ నెలలో రూ.2 వేల కోట్ల రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు తీసుకునే ఈ రుణాన్ని 8-10 ఏళ్లలో చెల్లించనుంది. నెలకు రూ.10-12 వేల కోట్ల ఆదాయం పొందే రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా లాక్‌డౌన్‌తో భారీ గండి పడిన విషయం తెలిసిందే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో నెలకు రూ.50-100 కోట్ల ఆదాయం మాత్రమే రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నందున కేంద్రం నుంచి కూడా ఆర్థిక సాయం అందే పరిస్థితి లేదు. వచ్చే 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.15,051 కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఆ రుణాన్ని ఒకేసారి తీసుకునేందుకు ఆర్‌బీఐ నిబంధనలు అడ్డొస్తాయి. అందుకే ఈ నెలలో రూ.2వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 13న ప్రభుత్వ బాండ్లను వేలం వేస్తారు. మరోవైపు కేంద్రంతో మాట్లాడి ఆర్‌బీఐ పరిమితిని ఎత్తేయించడం ద్వారా ఒకేసారి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. 

Updated Date - 2020-04-10T06:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising