ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సా..గుతున్న ‘భువన్‌’ సర్వే

ABN, First Publish Date - 2020-09-07T11:05:12+05:30

‘భువన్‌’ యాప్‌ సర్వేకు కొవిడ్‌ భయం పట్టుకుంది. గడువు ముగిసినా సర్వే ఇంకా సాగుతూనే ఉంది. ఫలితంగా ఉమ్మడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ ప్రభావంతో జంకుతున్న ఉద్యోగులు

నిర్ణీత గడువు ముగిసినా రాని డాటా

పురపాలికల ఆదాయానికి గండి


హన్మకొండ, సెప్టెంబర్‌ 6, (ఆంధ్రజ్యోతి): ‘భువన్‌’ యాప్‌ సర్వేకు కొవిడ్‌ భయం పట్టుకుంది. గడువు ముగిసినా సర్వే ఇంకా సాగుతూనే ఉంది. ఫలితంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని తొమ్మిది మునిసిపాలిటీల్లో ఇళ్ల వివరాలు ‘భువన్‌’ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇంటింటికీ వెళ్ళి నమోదు చేసేందుకు సిబ్బంది జంకుతున్నారు. కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్న దృష్ట్యా ఆయా వార్డుల్లో తిరిగేందుకు అధికారులు, సిబ్బంది వెనుకాడుతున్నారు. ఫలితంగా ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఒక్కో ఉద్యోగి కేవలం 30 ఇళ్లను మాత్రమే సర్వే చేస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఆగస్టు 15 నాటికే పూర్తి చేయాలని తొలుత ఆదేశాలు జారీ చేసినా.. వివిధ కారణాలతో నమోదుకు కొంత గడువు ఇచ్చింది. సమయం నిర్ధారించకపోయినా త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.


ఇంటర్నెట్‌తో ఇబ్బందులు

భువన్‌ యాప్‌కు కరోనా భయం ఓ వైపు ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా.. మరోవైపు ఇంటర్‌నెట్‌ నెమ్మదిగా రావడం మరింత అవరోధంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఒక్కో నివాసం పూర్తి చిరునామా యాప్‌లో పొందుపర్చాలంటే సుమారు అరగంట సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. కొవిడ్‌ భయం కారణంగా కొందరు సిబ్బంది తరుచూ గైర్హాజరవుతున్నారు. 


వెబ్‌సైట్‌లో వివరాలు..

పురపాలిక, నగర పంచాయతీల్లోని అసె్‌సమెంట్ల వివరాలన్నీ భువన్‌ వెబ్‌సైట్లో నిక్షిప్తం కానున్నాయి. చిత్రాలు, విస్తీర్ణంతో సహా వివరాలు పక్కాగా అందుబాటులోకి వస్తాయి. ఇస్రో సహకారంతో భువన్‌ యాప్‌ ద్వారా పట్టణాల్లోని అసె్‌సమెంట్లను ప్రభుత్వం జల్లెడ పట్టడానికి ఈ యాప్‌ను రూపొందించింది. సచిత్రాలతో సేకరించిన సమాచారాన్ని పురపాలక, రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానించాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో ఈ అంశంపై పురపాలక ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ, నర్సంపేట, మహబూబాబాద్‌, తొర్రూరు, డోర్నకల్‌, మరిపెడ, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి మునిసిపాలిటీల్లోనూ ప్రక్రియ ఆరు నెలల క్రితమే ప్రారంభమైంది.


అడ్డుకట్ట వేయడానికి..

పురపాలిక, నగర పంచాయతీల్లో అసె్‌సమెంట్‌ చేయని భవనాలు కొంత మేర ఉంటుండగా నిర్మించిన అంతస్తుల కన్నా తక్కువకు అసె్‌సమెంట్‌ చేసినవి కూడా ఉంటున్నాయి. ఇక వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నా వాటిని గృహాల కింద పరిగణిస్తూ ఆస్తి పన్ను నిర్దేశిస్తున్నవి కోకొల్లలు. ఇలా ఎన్నో లోపాలుంటున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి పురపాలక శాఖ ప్రత్యేక కార్యాచరణకు నడుం బిగించింది. భువన్‌ యాప్‌ద్వారా ప్రతీ అసె్‌సమెంట్‌ చిత్రాలను ఆకాంక్షాలు, రేఖాంశాల ఆధారంగా చరవాణిలో చిత్రాలు తీసి వెబ్‌సైట్లో పెట్టనున్నారు. దీని వల్ల పారదర్శకత నెలకొనే అవకాశం ఉంది.


ఏం చేస్తారు?

భువన్‌యా్‌పలో వివరాలు నమోదు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో పురపాలిక, నగర పంచాయతీ ఆర్వో/ఆర్‌, సిస్టమ్‌ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా పట్టణ స్థాయిలో బిల్‌ కలెక్టర్లకు అవగాహన కల్గించాల్సి ఉంది. బిల్‌ కలెక్టర్లు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో భువన్‌ యాప్‌డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వీరికి కేటాయించిన వార్డుల్లో పర్యటించి ఈ యాప్‌ ద్వారా ప్రత్యేక నమోదు కార్యక్రమం చేపట్టాలి. ఈ యాప్‌ ద్వారా జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం వినియోగించి మొదట భవనం రూఫ్‌పైకి వెళ్ళి చిత్రం తీస్తారు. పెంకుటిట్లు ఉండే గుమ్మం వద్ద నిలుచుని ప్రక్రియ చేపడతారు. ఫలితంగా ఆక్షాంశం, రేఖాంశం ఆధారంగా భవనం ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. ఈ సమాచారం భువన్‌ యాప్‌లోకి పంపిస్తారు.


యాప్‌ ద్వారా ఇలా..

ఖాళీ ప్రదేశం సహా భవనం అంతా కనిపించేలా ఒకటి, ద్వారం కనిపించేలా మరొక చిత్రం తీసి భువన్‌ యాప్‌ ద్వారా వెబ్‌సైట్లోకి పంపిస్తారు. బిల్‌ కలెక్టర్లు పంపిన సమాచారాన్ని ఉన్నతాధికారులు ఆమోదించాల్సి ఉంటుంది. ఇస్రోతో ఒప్పందం నేపథ్యంలో ఆయా భవనాల విస్తీర్ణం కూడా నమోదు చేయవచ్చని బల్దియా అధికారులు అంటున్నారు. దానికి తోడో మాన్యువల్‌గా కూడా లెక్కలు తీస్తారు. ఈ రెండింటి సమాచారాన్ని పోల్చుకోవచ్చు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఈ-సువిధ (పురపాలక శాఖ వెబ్‌సైట్‌)లో పొందుపరుస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖకు కూడా అనుసంధానిస్తారు. అసె్‌సమెంట్‌ చేయని అండర్‌ అసెస్డ్‌ (నిర్మించిన అంతస్తుల కన్నా తక్కువ అంతస్తులకు  ఆస్తి మదింపు చేసిన) భవనాల లెక్క తేలుతుంది. భవనాలు/ఇళ్ళ చిత్రాలతో కూడిన సంపూర్ణ వివరాలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉండడం వల్ల అధికారులు ఈ అంశాలపై సులువుగా  సమీక్షించే అవకాశం ఉంటుంది. ఆస్తి పన్ను ద్వారా ఆదాయం పెరగడానికి మార్గం సులువవుతుంది. రిజిస్ట్రేషన్‌ శాఖకు అనుసంధానించడం వల్ల అక్రమ రిజిస్ట్రేషన్‌కు అడ్డుకట్ట పడుతుంది.

Updated Date - 2020-09-07T11:05:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising