ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధిహామీ పనులు ముమ్మరంగా చేపట్టాలి

ABN, First Publish Date - 2020-04-07T10:38:45+05:30

గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ అ న్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, ఏప్రిల్‌ 6 : గ్రామాల్లో ఉపాధిహామీ పనులు ముమ్మరంగా చేపట్టాలని కలెక్టర్‌ శరత్‌ అ న్నారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో డివిజన్‌ స్థాయి అధికారులతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో 50 నుంచి 100 మంది కూలీలు పనులు చేసే వి ధంగా చూడాలని కోరారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మాస్క్‌లను తయారు చేయించాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన మా స్క్‌లను తయారు  చేయాలని పేర్కొన్నారు. బి య్యం పంపిణీ పూర్తికానీ డీలర్‌ సంబంధిత తహ సీల్దార్లతో కలెక్టర్‌ కార్యాలయంలో  మంగళవారం సాయంత్రం జరిగే సమావేశానికి హాజరు కావాలన్నారు.


వార్డుల్లో తడి, పొడి చెత్తను సేకరించాలని సూచించారు. నిత్యావసర వస్తువులు కూరగాయా లు సంచార వాహనాల ద్వారా ప్రజలకు అందే విధంగా అధికారులు చూడాలని కోరారు. వైరస్‌ లక్ష ణాలు ఉన్న వ్యక్తుల నుంచి శాంపిళ్లను మంగళ వారం ఉదయం వందశాతం సేకరించాలని పేర్కొ న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్‌లు తేజాస్‌ నందలాల్‌పవార్‌, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్‌, డీఆర్‌డీఓ చంద్రమోహన్‌ రెడ్డి, డీపీవో సాయన్న, జిల్లా ఆరోగ్యమిషన్‌ అధికా రిణి విశాల, రాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-07T10:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising