ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో నలుగురి మృతి

ABN, First Publish Date - 2020-07-16T11:57:24+05:30

జిల్లాలో కోవిడ్‌ లక్ష ణాలతో బుధవారం నలుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు పాజిటి వ్‌ వ్యక్తులు కాగా,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతుల్లో ఇద్దరికి పాజిటివ్‌, మరో ఇద్దరికి కోవిడ్‌-19 లక్షణాలు 

అందరూ 60 ఏళ్ల పైబడిన వారే

బయటకు పొక్కనీయని ఆసుపత్రి వర్గాలు

గుట్టుగా మృతదేహాల తరలింపు


నిజామాబాద్‌, జూలై 15 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి): జిల్లాలో కోవిడ్‌ లక్ష ణాలతో బుధవారం నలుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు పాజిటి వ్‌ వ్యక్తులు కాగా, మరో ఇద్దరు కరోనా లక్షణాలు ఉన్న అనుమానితులు ఉన్నారు. వీరు నగరం పరిధిలోని కంఠేశ్వర్‌, హబీబ్‌పురా, బూరుడ్‌గల్లీ, హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందినవారు. కాగా వీరంతా 60 ఏళ్లకుపైబడిన వారే. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ నలుగురు  మంగళవారం రాత్రి నుంచి బుధవారం సా యంత్రం వరకు వేర్వేరు సమయాల్లో పరిస్థితి వి షమించి మృతి చెందారు. సాయంత్రం వీరి కుటుంబాలకు సమాచారం ఇచ్చి అధికారులు దహనసంస్కారాలు పూర్తి చేసినట్లు సమాచారం. 


బయటకు పొక్కనీయని ఆసుపత్రి వర్గాలు....

కరోనాతో చికిత్స పొందుతూ బుధవారం నలుగురు మృతి చెందగా ఈ విషయాన్ని ఆసుపత్రివర్గాలు బయ టకు పొక్కనీయకుండా జాగ్రత్త పడ్డాయి. మూడు రోజుల క్రితం నలుగురు కరోనాతో మృతి చెందిన విషయం విధి తమే. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజీ నామా చేశారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం నలుగురు వ్యక్తులు మృతి చెందినా సాయంత్రం వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రి వర్గాలు గోప్యత పాటించాయి. అ నంతరం కుటుంబీకులకు సమాచారం అందించి గుట్టుగా మృతదేహాలను తరలించారు. మృతులకు సంబంధించిన ఫొటోలు, వివరాలు బయటకు తెలియనీయకుండా జాగ్రత్తలు పడ్డారు.


జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్‌ కేసుల నమోదు...

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బుధవారం మొత్తం 13 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు  డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఇందులో 11 మంది నిజామాబాద్‌ నగరం పరిధిలోని ఆర్యనగర్‌, అహ్మద్‌పురా, కోజాకాలనీ, శ్రీనివాస్‌నగర్‌, వినాయక్‌నగర్‌, చంద్రనగర్‌, ఖలీల్‌వాడి, గాంధీగంజ్‌ ప్రాంతంలో ఈ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు బోధన్‌కు చెందిన వారున్నారని తెలిపారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 281కి చేరింది. ఇప్పటివరకు 14 మంది మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 167 మంది జిల్లా కేంద్ర ఆసుపత్రితోపాటు హైదరాబాద్‌లోని గాంధీ, పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు డీఎంహెచ్‌వో తెలిపారు. ప్రజలు కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు పాటించి ఆయన కోరారు. 

Updated Date - 2020-07-16T11:57:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising