ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరు జిల్లా నేతలకు చోటు

ABN, First Publish Date - 2020-08-03T11:10:57+05:30

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరు జిల్లా నేతలకు చోటుదక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఇద్దరు జిల్లా నేతలకు చోటుదక్కింది. ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించిన కార్యవర్గంలో జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డికి చోటు కల్పించారు. జిల్లాతో పాటు రాష్ట్ర స్థా యిలో పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపు నిచ్చారు. రాష్ట్ర స్థాయిలో కీలకంగా పనిచేసే అవకాశం కల్పించారు. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గా 2009 నుంచి 2014 వరకు పనిచేసిన యెండల లక్ష్మినారాయణను రా ష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఆయన జిల్లాతో పాటు రాష్ట్ర స్థా యిలో చేసిన సేవలకు గుర్తింపు నిచ్చారు. బీజేవైఎం నుంచి జిల్లా అధ్యక్షు డి వరకు ఆయన పనిచేశారు. ఎమ్మ్యెల్యేగా ఉన్న సమయంలో శాసనసభ పక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశా రు.


జిల్లాలో పలు అంశాలపై పార్టీ నేతలతో కలిసి ఉద్యమించారు. గత కొన్ని రోజులుగా కీలక పదవి వస్తుందని భావించిన ఆయనకు ఊహించి న విధంగానే రాష్ట్ర స్థాయిలో పనిచేసేందుకు మరో దఫా జిల్లా నుంచి ఆ యనకు అవకాశం కల్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రెండు దఫాలు పనిచేసి తన హయాంలో ఎవరూ ఊహించని విధంగా ఎంపీ సీటు గెలు చుకునేందుకు పార్టీ నేతలతో కలిసి కృషి చేసిన పల్లె గంగారెడ్డిని రాష్ట్ర కా ర్యదర్శిగా నియమించారు.


ఆధునిక వ్యవసాయానికి పేరొందిన అంకాపూ ర్‌కు చెందిన ఆయన రెండు దఫాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. జిల్లా లో పార్టీ బలోపేతానికి కృషిచేశారు. గత మున్సిపల్‌, స్థానిక సంస్థల ఎన్ని కల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషిచేశారు. పార్టీకి తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రయత్నాలు చేశారు. గతంలో జిల్లా పార్టీలో కీలక పదవు లలో పనిచేశారు. ఆయన సేవలను మరింత ఉపయోగించుకునేందుకు రాష్ట్ర స్థాయిలో మరింత వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. వీరిద్దరికి  పార్టీలో రాష్ట్ర స్థాయిలో పనిచేసేందుకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఇతర నేతలకు ఇద్దరు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-08-03T11:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising