ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పసుపునకు రూ.15వేల మద్దతు ధర ఇవ్వాలి’

ABN, First Publish Date - 2020-02-28T11:07:09+05:30

పసుపు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లోని మార్కెట్‌యార్డులో పసుపును పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 27: పసుపు మద్దతు ధర రూ.15 వేలు ఇవ్వాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రం లోని మార్కెట్‌యార్డులో పసుపును పరిశీలించారు. రైతులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకు న్నా రు. ఈసందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేగాం యాదగౌడ్‌ మాట్లాడుతూ, ప్రస్తుతం మార్కెట్‌లో పసుపు రైతులను చాలా అన్యాయం జరుగుతుంద న్నారు. కేవలం రూ.4వేల నుంచి 4వేల500 మాత్ర మే ధర పలుకతుందన్నారు.


ఎకరం పంటకు లక్ష కుపైగా ఖర్చుఅయితే ఈధరతో కేవలం 80వేలు మాత్రమే వస్తుందని తెలిపారు. ఇలాగే కొనసాగితే రైతులు క్రాప్‌హలీడే ప్రకటిస్తారని ఆయన తెలిపా రు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేద న్నారు. రుణమాఫీ ఇంకా కాలేదని తెలిపారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధు ఎలక్షన్‌ అయిపోయే వరకు ఇచ్చారని  తెలిపారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఎ టు పోయిందని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేకపాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో రెంజర్ల సురేష్‌,  వినోద్‌కూమార్‌, కృ పాజ్యోతి, రాజశేఖర్‌, రాజేశ్వర్‌, అంబిక సత్యనారా యణ, శంకర్‌, లవంగరాజు, దాత్రిక రవి తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-28T11:07:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising