ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాన కాల్వకు తూట్లా?

ABN, First Publish Date - 2020-12-29T05:09:28+05:30

నిండుగా ఉన్న నిజాంసాగర్‌ ప్రధాన కాల్వకు తూట్లు పడ్డాయి. ఫలితంగా వంద నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు మంజీరా నదిలోకి వృథాగా వెళుతున్నా నీటి పారుదల శాఖాధికా రులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

నిజాంసాగర్‌ ప్రధాన కాల్వ ఇదే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వృథాగా మంజీరా నదిలోకి నీళ్లు

చలనం లేని అధికార యంత్రాంగం

నిజాంసాగర్‌, డిసెంబరు 28: నిండుగా ఉన్న నిజాంసాగర్‌ ప్రధాన కాల్వకు తూట్లు పడ్డాయి. ఫలితంగా వంద నుంచి 200 క్యూసెక్కుల నీళ్లు మంజీరా నదిలోకి వృథాగా వెళుతున్నా నీటి పారుదల శాఖాధికా రులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. 

నాలుగేళ్ల తర్వాత నిండిన ప్రాజెక్టు

నాలుగేళ్ల తర్వాత నిండిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం నిం డు గా ఉంది. యాసంగి పంటల సాగు కోసం ఏడు విడతలుగా సాగు నీ రు అందించేందుకు సలహా మండలి సమావేశమై తీర్మానం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి మొదటి విడత ప్రధాన కాల్వ వెంట క్రమే పాన నీటి విడుదలను విడుదల చేస్తూనే ఉన్నారు. ప్రధాన కాల్వకు అనుసంధానంగా ఉన్న టిన్‌ రెగ్యూలేటర్ల నుంచి నీరు లీకవుతూనే ఉ న్నా నీటి పారుదల శాఖాధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించ డం గమనార్హం. ఈ ఏడాది యాసంగిలో లక్షా 8 వేల ఎకరాలకు 1 నుంచి 36వ డిస్ర్టిబ్యూటరీ వరకు సాగునీటిని అందిస్తున్నారు. ప్రధాన కాల్వ పర్యవేక్షణ లేని కారణంగా నీరు వృథాగా పోతూనే ఉంది. ని జాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 1405 అడుగులకు గాను 1404.22 అ డుగుల నీటి సామర్థ్యం కలిగి 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 16.675 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటివరకు నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 1.325 టీఎంసీల నీటిని ప్రధాన కాల్వలోనికి విడుదల చేశారు. పర్యవేక్షణ కరువవుతుందని పలువురు వాపోతున్నారు.  నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 7 విడతలుగా యాసంగికి నీరు విడు దల చేస్తున్నందున నిజాంసాగర్‌ నుంచి ఎన్ని నీళ్లు వృథాగా వెళుతుం దో వేచి చూడాల్సిందే.  

Updated Date - 2020-12-29T05:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising