ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోల్‌ బంక్‌లో దొంగల బీభత్సం

ABN, First Publish Date - 2020-09-29T07:09:00+05:30

బోధన్‌ పట్టణ శివారులోని నాగన్‌పల్లి రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో పెట్రోల్‌ బంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అర్ధరాత్రి ముసుగులతో వచ్చి దోపిడీకి యత్నం

బంక్‌ సిబ్బందిపైకి రాళ్లు రువ్విన దొంగలు

మహారాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు


బోధన్‌, సెప్టెంబరు 28: బోధన్‌ పట్టణ శివారులోని నాగన్‌పల్లి రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో పెట్రోల్‌ బంక్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్థరాత్రి వేళ ముసుగులతో వచ్చి దోపి డీకి యత్నించారు. చేతిలో రాళ్లు, కర్ర లతో వచ్చిన దొంగలు దోపిడీకి విఫల యత్నం చేశారు. దొంగల బీభత్సం పెట్రోల్‌ బంక్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. మహారాష్ట్ర ము ఠాగా పోలీసులు అనుమానిస్తు న్నారు. దొంగలు దోపిడీకి యత్నించిన సమయంలో పెట్రోల్‌ బంక్‌లో క్యాష్‌కౌంటర్‌లో నగదు లేదు. పోలీసుల కథనం ప్ర కారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని శిరిడీ సాయి ఫిల్లింగ్‌ స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఇద్దరు పెట్రోల్‌ బంక్‌ వ్యక్తులు విధులు ముగించుకొని పడుకున్నారు.


అర్థరాత్రి 12గంటల సమయంలో ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు పెట్రోల్‌బంక్‌ లోపలికి చొరబడి రాళ్లు, కర్రలతో దా డికి ప్రయత్నించారు. క్యాష్‌ కౌంటర్‌ను తెరిచి చూడగా నగ దు లేకపోవడంతో చేతుల్లో ఉన్న రాళ్లు, కర్రలతో దాడికి ప్ర యత్నించగా ఇద్దరు వ్యక్తులు అరుపులు కేకలు పెట్టడంతో పక్కనే ఉన్న దాబా నిర్వాహకులు, పనిచేసే వ్యక్తులు పెట్రో ల్‌ బంక్‌ వద్దకు రావడంతో దొంగలు అక్కడి నుంచి పరార య్యారు. దుండగులు పెట్రోల్‌ బంక్‌ వెనక భాగంలోని ఫెన్సి ంగ్‌ను కత్తిరించి లోపలికి చొరబడ్డట్లు పోలీసులు గుర్తించా రు. దుండగులు మహారాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమాని స్తున్నారు. ముందే రెక్కి నిర్వహించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంక్‌లోని సీసీ పుటేజీలతోపాటు వివి ధ గ్రామాలలోని ప్రధాన కూడళ్ల సీసీ పుటేజీలను పోలీసు లు పరిశీలిస్తున్నారు. అర్థరాత్రి సమాచారం అందుకున్న బో ధన్‌ ఏసీపీ రామారావు, పట్టణ సీఐ రాకేష్‌గౌడ్‌ ఘటనా స్థ లానికి చేరుకొని, ఘటనలో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగ లే దని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-29T07:09:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising