ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7వ తేదీ నుంచి సదరం క్యాంప్‌

ABN, First Publish Date - 2020-11-28T04:58:13+05:30

కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిసెంబరు 7వ తేదీ నుంచి ప్రతీ సోమవారం సదరం క్యాంపులు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ డీఆర్‌ డీఏ అధికారి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 27: కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిసెంబరు 7వ తేదీ నుంచి ప్రతీ సోమవారం సదరం క్యాంపులు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ డీఆర్‌ డీఏ అధికారి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ.. నిజామాబాద్‌ జిల్లాలోని ఆసరా పెన్షన్‌దారుల సౌలభ్యం కోసం గడువు ముగిసిన సదరం సర్టిఫికెట్లకు, కొత్తవారికి మాత్రమే ప్రతీ సోమవారం సదరం క్యాంపులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. డిసెంబరు 7న ని జామాబాద్‌ డివిజన్‌కు సంబంధించిన క్యాంపు, 14న బోధన్‌ డివిజన్‌కు సంబంధించి న క్యాంపు, 21న ఆర్మూర్‌ డివిజన్‌కు సంబంధించిన క్యాంపు నిర్వహిస్తామన్నారు. ని జామాబాద్‌ డివిజన్‌ పరిఽధిలోని నిజామాబాద్‌ అర్బన్‌, ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్‌, మోపాల్‌, నవీపేట, సిరికొండ, నిజామాబాద్‌ రూరల్‌ మండలాలకు చెందిన వారు డిసెంబరు 7న క్యాంపునకు హాజరుకావాలన్నారు. బోధన్‌ డివిజన్‌కు సంబంధించి బోధన్‌ అర్బన్‌, బోధన్‌, చందూర్‌, కోటగిరి, రుద్రూరు, మోస్రా, వర్ని, రెంజల్‌, ఎడపల్లి మండలాలకు చెందిన వారు డిసెంబరు 14న క్యాంపునకు హాజరుకావాలని, ఆర్మూర్‌ డివిజన్‌కు సంబంధించి ఆర్మూర్‌ అర్బన్‌, భీమ్‌గల్‌ అర్బన్‌, బాల్కొండ, జక్రాన్‌పల్లి, కమ్మర్‌పల్లి, మెండోర, భీమ్‌గల్‌, ఆర్మూర్‌, ముప్కాల్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, నందిపే ట, వేల్పూర్‌ మండలాల వారు డిసెంబరు 21న జరిగే క్యాంపునకు హాజరుకావాలన్నా రు. ప్రతీ క్యాంపునకు 22 మంది రెన్యూవల్‌తో పాటు అదనంగా 32 మంది కొత్తవారి కి సదరం సర్టిఫికెట్‌లను మంజూరు చేయడం జరుగుతుందని, కాబట్టి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ లబ్ధిదారులు క్యాంపునకు హాజరుకావాలని ఆయన కోరారు.  

Updated Date - 2020-11-28T04:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising