ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గని నేరాలు ఘోరాలు.. ఎక్కువైన పేకాట, మట్కా, గుట్కా కేసులు

ABN, First Publish Date - 2020-12-30T05:12:32+05:30

2020 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో అన్ని రంగాలు దెబ్బతిన్నా.. నేరాలు, ఘోరాలు మాత్రం తగ్గలేదు. గతంతో పోలిస్తే కాస్తా నేరాలు తగ్గినప్పటికీ.. హత్యలు, ఆత్మహత్యలు పెరిగాయి. అక్రమసంబంధాలు, ఆస్తి తగాదాలు, హత్య కేసులు ఎక్కువగానే జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉమ్మడి జిల్లాలో గతంతో పోలిస్తే పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు

ఉభయ జిల్లాల్లోనూ మహిళలపై తగ్గిన అఘాయిత్యాలు.. రోడ్డు ప్రమాదాలు 

అవినీతి ఆరోపణలతో ఖాకీల సస్పెన్షన్‌ 

కరోనా ప్రభావంతో కొంత తగ్గిన నేరాలు


నిజామాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/కామారెడ్డి, (ఆంధ్రజ్యోతి): 2020 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కరోనాతో అన్ని రంగాలు దెబ్బతిన్నా.. నేరాలు, ఘోరాలు మాత్రం తగ్గలేదు. గతంతో పోలిస్తే కాస్తా నేరాలు తగ్గినప్పటికీ.. హత్యలు, ఆత్మహత్యలు పెరిగాయి. అక్రమసంబంధాలు, ఆస్తి తగాదాలు, హత్య కేసులు ఎక్కువగానే జరిగాయి. క్షణికావేశం, తొందరపాటు తనం, ప్రేమ విఫలం కావడం లాంటి చిన్నచిన్న కారణాలతో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రహదారులు సైతం రక్తమోడాయి.  


నెత్తురోడిన రహదారులు

నిజామాబాద్‌ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 22 శాతం తగ్గినా.. ప్రమాదాలు మాత్రం ఎక్కువగానే జరిగాయి. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర, జిల్లా రహదారులపై 271 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 292 మంది చనిపోయారు. సుమారు 505 మంది గాయపడ్డారు. కామారెడ్డి జిల్లాలో మాత్రం గత ఏడాది కంటే ఈసారి రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 501 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 219 మంది మృత్యువాత పడ్డారు. 553 మంది గాయాలపాలయ్యారు. 10 రోజుల క్రితం బిచ్కుంద మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. నాగిరెడ్డిపేట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు మృతిచెందారు. లాక్‌ డౌన్‌ సమయంలో సదాశివనగర్‌ మండలం దగ్గి జాతీయ రహదారిపై లారీ టైర్‌ పేలి నలుగురు మృత్యువాత పడ్డారు. అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. 


మహిళలపై తగ్గిన అఘాయిత్యాలు

గత సంవత్సరంతో పోలిస్తే మహిళలపై ఈ యేడు అఘాయిత్యాలు కాస్త తగ్గాయి. గత ఏడాది నిజామాబాద్‌ జిల్లాలో 532 కేసులు నమోదు కాగా.. ఈ సంవత్సరం 414 కేసులు నమోదయ్యాయి. వరకట్న హత్య కేసులు 3, వరకట్నం తేవాలని హింసించిన కేసులు 231, ఈవ్‌టీజింగ్‌ కేసులు 44, అత్యాచారయత్నం కేసులు 140 నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలో వరకట్న వేధింపుల వల్ల ముగ్గురు మహిళలు ఆత్మహత్యకు పాల్పడగా.. 136 కేసులు నమోదయ్యాయి. అత్యాచార కేసులు 12 నమోదయ్యాయి. 


పెరిగిన పేకాట, మట్కా, గుట్కా కేసులు

ఈ సంవత్సరం నిజామాబాద్‌ జిల్లాలో పేకాట, మట్కా, గుట్కా కేసులు భారీగా నమోదయ్యాయి. పేకాట కేసులు 409 నమోదు కాగా.. 2,095 మందిని అరెస్టయ్యారు. వారి వద్ద నుంచి పోలీసులు 51,36,225 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 24 మట్కా కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 1,79,630 రూపాయలను స్వాఽధీనం చేసుకున్నారు. 132 గుట్కా కేసులు నమోదు చేసి సుమారు 1,23,42,440 రూపాయల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో మాత్రం పేకాట, మట్కాను పోలీసు శాఖ పూర్తిగా నిర్మూలించగలిగింది. పేకాట క్లబ్‌లను మూసివేయించారు. ఈ ఏడాది 1,360 కేసులు నమోదు చేసి రూ.2.69 కోట్లు పేకాటరాయుళ్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.


ఆగని హత్యలు, ఆత్మహత్యలు

ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం హత్యలు, ఆత్మహత్యలు బాగా పెరిగాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఈ సంవత్సరం 12 నెలల్లో మొత్తం 31 హత్య కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం కేసులు 47 నమోదయ్యాయి. కామారెడ్డి పట్టణశివారులోని బీడీ వర్కర్స్‌ కాలనీలో జంట హత్యలు కలకలం రేపాయి. బాన్సువాడ పట్టణ శివారులో కసాయి తండ్రి ముక్కుపచ్చలారని ముగ్గురు కూతుర్లను చెరువులో ముంచి చంపాడు. అదేవిధంగా బిచ్కుంద మండలంలో ఆస్తి విషయంలో కొడుకు కన్నతల్లిని హతమర్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. లాంటి సంఘటనలు జిల్లాలో ఎదో ఒకచోట చోటుచేసుకొంటునే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 28 హత్యలు జరగగా ఇందులో 16 కేసులను పోలీసులు ఛేదించారు. అలాగే, నిజామాబాద్‌ జిల్లాలో గత సంవత్సరం 256 మంది ఆత్మహత్య చేసుకోగా.. ఈ ఏడాది మొత్తం 301 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కామారెడ్డి జిల్లాలో 559 మంది ఆత్మహత్య చోటు చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా 18 నుంచి 35 సంవత్సరాలు లోపు ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు.  


అవినీతి ఆరోపణలతో ఖాకీలపై సస్పెన్షన్‌ వేటు

ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లాలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది అవినీతి అక్రమాల వల్ల పోలీసు శాఖకు మాయని మచ్చ మిగిలింది. క్రికెట్‌ బెట్టింగ్‌, అనుమతి లేని స్కీంలు, చీటీలు, ఇసుక దందాలో, సివిల్‌ తగాదాల్లో, భూముల తగాదాల్లోనూ తలదూర్చి అవినీతి అక్రమాలు పాల్పడడంతో కొందరు పోలీసు అధికారులు సిబ్బందిపై శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో డీఎస్పీ లక్ష్మీనారయణ అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడని ఏసీబీ విచారణలో తేలడంతో జైలు పాలవడంతో పాటు అతనిపై శాఖాపరంగా సస్పెన్షన్‌కు గురయ్యాడు. పట్టణ సీఐ జగదీష్‌, ఎస్‌ఐ గోవింద్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ విషయంలో వసూలు చేశారనే ఆరోపణలు రుజువుకావడంతో సస్పెన్షన్‌ అయ్యారు. బాన్సువాడ రూరల్‌ సీఐ టాటాబాబు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. బోధన్‌ పట్టణ సీఐ, ఎస్‌ఐ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నుంచి డబ్బులు, విలువైన సెల్‌ఫోన్‌ తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. వీరే కాకుండా మద్నూర్‌, బీబీపేట, దోమకొండ మండలాల పరిధిలో ఇసుక మాఫియాతో సంబంధాలు ఉండి అక్రమ ఇసుక రవాణాకు సహకరించారని పలువురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు.


నేరాల అదుపునకు అన్ని రకాల చర్యలు చేపట్టాం : కార్తికేయ, సీపీ, నిజామాబాద్‌

జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్‌ యంత్రాంగం అన్ని చర్యలను చేపట్టడం వల్లనే కొంత మేరకు కేసులు తగ్గాయని  నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు. కరోనా సమయంలో బందోబస్తులో పాల్గొంటూనే నేరాల నియంత్రణకు పోలీస్‌స్టేషన్‌ల వారిగా చర్యలు తీసుకున్నామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా చూస్తూనే దొంగతనాలతో పాటు ఇతర  కేసుల నియంత్రణ చేశామన్నారు. వివిధ కేసుల్లో దొంగతనాలు జరిగిన సొత్తును కూడా స్వాధీనంచేసుకున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-12-30T05:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising