ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా నిషేధిత గుట్కా దందా!

ABN, First Publish Date - 2020-03-16T08:58:20+05:30

జిల్లా కేంద్రం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతుంది.పోలీసుల కళ్లుకప్పి కొం దరు అక్రమార్కులు ఈ వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు వెలుగు చూస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరంలో టాస్క్‌ఫోర్స్‌ దాడులతో  వెలుగు చూస్తున్న నిజాలు

అధికారం ముసుగులో గుట్కా వ్యాపారం


ఖిల్లా, మార్చి 15 : జిల్లా కేంద్రం అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతుంది.పోలీసుల కళ్లుకప్పి కొం దరు అక్రమార్కులు ఈ వ్యాపారాలను కొనసాగిస్తున్నట్లు వెలుగు చూస్తున్నాయి. అధికార పార్టీకి చెంది న కొందరు ఆ పార్టీ ముసుగులో వివిధ రకాల అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతాంలో ఈ వ్యాపారాలు యధేచ్చ గా కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నాయి. తా ము అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు తమ ను ఎవరు ఏమి చేయలేరనే ధీమాతో కొందరు ఈ వ్యా పారాలకు తెర లేపుతున్నారని ప్రచారం జరుగుతుంది.  ముఖ్యంగా ప్రజల జీవితాలను నాషనం చేసే నిషేధిత గుట్కా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందని ప్రజలు చెప్పుకుంటున్నారు.


ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ గుట్క వ్యాపారాన్ని అధి కార పార్టీ వ్యక్తులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. గ తంలో గుట్కా వ్యాపారాన్ని అధికార పార్టీ నేతల అండ దండలతో జరిగేదని, అయితే పోలీసు శాఖ సీరియస్‌గా ఉండడం వల్ల గుట్కా వ్యాపారంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో లక్షల రూపాయల గుట్కాను స్వాధీనం చే సుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు.


జిల్లాలో గుట్కాను పూర్తిగా లేకుండా చేయడానికి  సీపీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుని  గుట్కా వ్యాపారంపై ని ఘా పెట్టి ఖచ్చితమైన సమాచారంతో దాడులు నిర్వహించింది. లక్షల రూపాయల విలువ గల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకుని దానిని రవాణ చేస్తున్న వారిని అదుపులోకి చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.  దీంతో గతంలో ఈ వ్యాపారం చేసిన వారు మానివేయడంతో దీనిని తిరిగి మరి కొందరు వ్యక్తులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో తయారవుతున్న వివిధ రకాల గుట్కాను అక్రమ మార్గాన ర వాణ చేస్తున్నారని సమాచారం.


అలా రవాణ చేసిన  దానిని రహాస్య ప్రదేశాల్లో నిలువ చేసి చిల్లర వర్తకుల కు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది శనివారం భారీ ఎ త్తున గుట్కా తరలిస్తున్న వాహానాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న గుట్కా పెద్ద మొత్తంలో ఉన్నప్పటికి కేవలం రూ.4లక్షల విలువను మాత్రం చూపారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా ఈ గుట్కా ఓ అధికార పార్టీకి చెందిన వ్యక్తిదని తెలుస్తోంది.ఆ వ్యక్తి అధికార పార్టీ ముసుగులో గత కొంత కాలంగా కొందరు వ్యక్తులను ముందు పెట్టి తాను వెనుక ఉండి చక్రం తిప్పుతూ ఈ వ్యాపారం జరిపిస్తున్నట్లు సమాచారం.ఈ వ్యాపారం చే స్తున్న వారిపై ఫిర్యాదు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు సమాచారం.  అయితే గుట్కాను రవాణ చేసిన సమయంలో పట్టుపడ్డ వారు మాత్రం అసలు సూత్రధారుల పేర్లను బయట పెట్టడడం లేదని తెలుస్తోంది. శనివారం టాస్క్‌ఫోర్స్‌ బృందానికి పట్టుపడ్డ వ్యక్తిపై కే సునమోదు చేశారు.


కేసునమోదు చేసిన వ్యక్తిని అదు పులోకి తీసుకుని దీని వెనుక ఉన్నది ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం.  ఇటీవలే టాస్క్‌ఫో ర్స్‌ ఇన్స్‌పెక్టర్‌గా బాద్యతలు తీసుకున్న నరేందర్‌ కొంతకాలం జిల్లాలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై అవ గాహన చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు జిల్లా కేంద్రంలో ఏఏ అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని తమ బృందం సభ్యులతో కలిసి వాకబు చేసుకున్నారు. అక్రమ వ్యాపారాలపై అవగాహన కల్పించుకుని గత నాలుగు రోజులుగా దాడులు చేయడం మొదలు పెట్టా రు. ముందుగా జిల్లాలో ప్రజలను ప్రైజుల పేరుతో ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న స్కీములపై దాడులు చేశారు. అనంతరం అక్రమంగా రవాణ చేస్తున్న నీటి కి రోసిన్‌, పేదల రేషన్‌ బియ్యం నిలువలపై దాడులు చే శారు. గురు, శుక్ర, శని వారాల్లో వారు నిర్వహించిన దా డుల మూలంగా అక్రమ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లను పరుగులు పెట్టించారు. దీని ద్వారనైనా జిల్లాలో నిషేధిత గుట్కా వ్యాపారానికి చెక్‌ పడుతుందా లేదా వేచి చూడాలి.

Updated Date - 2020-03-16T08:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising