ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌన్సిల్‌లో విభేదాలు వాస్తవమే!

ABN, First Publish Date - 2020-03-16T10:36:39+05:30

కామారెడ్డి మున్సిపల్‌ పాలకవ ర్గంలో అధీలోనే అంతర్గత పోరుపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్చనీయాంశం అయిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

ఇప్పటికైనా పాలకవర్గం తీరు మారేనా?


కామారెడ్డి, మార్చి15 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి మున్సిపల్‌ పాలకవ ర్గంలో అధీలోనే అంతర్గత పోరుపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం పట్టణంలో, మున్సిపాలిటీలో తీవ్ర చర్చనీయంశం అయింది.పాలకవర్గం ఏర్పడి నెలరోజు లు గడవక ముందే కౌన్సిల్‌లో చీలికలు ఏమిటని, అధిపత్యపోరు ఎవరు కొన సాగిస్తున్నారని దానిపై పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల్లో చర్చ సాగినట్లు తె లుస్తోంది. ఇక కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గంలోని అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్ల మధ్య తీవ్ర చర్చనే సాగినట్లు సమాచారం. ఏకంగా కొందరు కౌ న్సిలర్లు ఆంధ్రజ్యోతికి ఫోన్‌ చేసి పాలకవర్గంలో చీలికలు, వర్గపోరు ఉన్నదవి వాస్తవమేనని వారు సైతం చెప్పుకొచ్చారు.


కొందరు కౌన్సిలర్లు దూకుడుగా వ్యవహరిస్తున్నారని ప్రతి పనికి ఒత్తిడి తీసుకవస్తున్నారని మున్సిపాలిటీలోని కొందరు అధికారులు సిబ్బంది సైతం ఆంధ్రజ్యోతితో తెలిపారు.కామారెడ్డి ము న్సిపాలిటీ పాలకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ నిర్భ యంగా బయటపెట్టడంపై పలువురు అభినందించారు. ఇప్పటికైన పాలకవర్గ సభ్యులు తీరు మార్చుకొని సమిష్టిగా పట్టణ అభివృద్దికి కృషి చేయాలని ప్రజ లు కోరుతున్నారు. ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వవిఫ్‌ గంప గోవర్ధన్‌ కలిగచేసుకొని పాలకవర్గం లోని కౌన్సిలర్ల మధ్య సమన్వయం తీసుక వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-16T10:36:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising