ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

22వ ప్యాకేజీ పనులను ప్రారంభించాలి

ABN, First Publish Date - 2020-06-16T11:10:33+05:30

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తు న్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 22వ ప్యాకేజీ పను లకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని కామారెడ్డిజిల్లా జలసాధన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి, జూన్‌ 15: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తు న్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో 22వ ప్యాకేజీ పను లకు నిధులు కేటాయించి వెంటనే పనులు ప్రారంభించాలని కామారెడ్డిజిల్లా జలసాధన సమితి జిల్లా కన్వీనర్‌ సిద్ధిరాములు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం పనులు అన్ని చోట్ల జరుగుతూ చివరిదశకు చేరుతున్నాయని, కానీ కామారెడ్డి జిల్లాకు చెందిన 22వ ప్యాకేజీని మాత్రం ఇంత వరకు నిధులు కేటాయించకుండా నిద్రావస్థకు చేరుకోవడం పట్ల జలసాధన సమితి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గతంలోని ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టులోని 7వ ప్యాకేజీని ప్రస్తుత ప్రభుత్వం కాళేశ్వరం 22వ ప్యాకేజీ మార్చారని, కానీ అక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని తెలిపారు. నిజామా బాద్‌లోని 20,21 ప్యాకేజీకి చెందిన పనులు పూర్తికావస్తున్నాయని అన్నారు.


ప్రజాప్రతినిధులు గోదావరి జలాలతో ఈ ప్రాంత రైతుల పాదాలు కడుగు తామని గొప్పలు చెబుతున్నారే తప్ప 22వ ప్యాకేజీ పనులకు కనీస నిధులు కేటాయించడంలో చొరవ చూపడం లేదని అన్నారు. ఉమ్మడి జిల్లా మంత్రి ప్రశాంత్‌రెడ్డి కేవలం నిజామాబాద్‌ ప్రాంతంపై మాత్రమే దృషిసారిస్తున్నారు తప్ప 22వ ప్యాకేజీ పనులపై అలసత్వం వహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అలసత్వం వీడకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి సభ్యులు అంజయ్య, వెంకట్రామిరెడ్డి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-16T11:10:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising