ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిచ్కుందలో ఉద్రిక్తత!

ABN, First Publish Date - 2020-12-29T05:41:04+05:30

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవా రం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైక్‌ను ఇసుక లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు ఇసుక లారీలపై దాడికి దిగారు. ప్రమా దానికి కారణమైన ఇసుక లారీకి ఏకంగా ఆందోళనకారులు నిప్పటించారు.

ఆందోళనకారులు నిప్పంటించడంతో కాలిపోతున్న లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బైక్‌ను ఢీకొన్న ఇసుక లారీ

ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తికి కాలు విరిగి తీవ్రగాయాలు

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు 

ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి నిప్పటించిన ఆందోళనకారులు

మరో 25 ఇసుక లారీల అద్దాలు ధ్వంసం

లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ శ్వేత

కామారెడ్డి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి)/బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవా రం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బైక్‌ను ఇసుక లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గ్రామస్థులు ఇసుక లారీలపై దాడికి దిగారు. ప్రమా దానికి కారణమైన ఇసుక లారీకి ఏకంగా ఆందోళనకారులు నిప్పటించారు. దీంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మార డంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను చెదరగొట్టి పోలీసులు పరిస్థితిని అదుపు లోకి తీసుకువచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లాలోని మంజీర నదిపై బీర్కూరు, బాన్సువాడ, బిచ్కుంద మండలాల పరిధిలో చెక్‌డ్యాంల నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణాలలో భాగంగా మంజీర నదిలోని ఇసుక రీచ్‌ల కు ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ ద్వారా అనుమతులు ఇచ్చింది. బిచ్కుంద, బీర్కూరు మండలాల పరిధిలోని 6 క్వారీలలో ఇ సుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రతీరోజు బిచ్కుంద మం డల కేంద్రం మీదుగా వందల లారీలు, టిప్పర్‌ల ద్వారా ఇ సుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సోమవారం రా త్రి బిచ్కుంద మండలంలోని ఖడ్గవ్‌ గ్రామంలోని మూడు ఇ సుక రీచ్‌ల నుంచి 10 లారీలలో ఇసుకను మండల కేంద్రం మీదుగా తరలిస్తున్నారు. అయితే టీఎస్‌ 15 యూడీ 6263 నంబర్‌ గల ఇసుక లారీ బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ బ్యాంక్‌ ఎదుట ప్రధాన రహదారిపై ఎదురుగా బైక్‌పై వస్తు న్న గోపన్‌పల్లి గ్రామానికి చెందిన విజయ్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో విజయ్‌ కుడి కాలుపై నుంచి లారీ దూసుకెళ్ల డంతో కాలు విరిగిపోయింది. తీవ్రగాయాలైన బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానికులు అంబులెన్స్‌లో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇసుక లారీకి నిప్పుపెట్టిన స్థానికులు

బిచ్కుంద మండల కేంద్రం మీదుగా ప్రతీరోజు వందల లారీలు, టిప్పర్‌లలో ఇసుకను తరలిస్తు ప్రమాదాలకు కార ణమవుతున్నాయంటూ గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో సోమవారం రాత్రి ఇసుక లారీల కారణంగా ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీని రోడ్డుపై నిలిపివేసి అద్దాలు ధ్వంసం చేశారు. ఆ ఇసుక లారీ వెనక ఉన్న మరో 25 లారీలను సైతం నిలిపివేసి అన్ని లారీల అద్దాలను పగులగొట్టా రు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీపై పెట్రోల్‌ పోసి నిప్పటించారు. స్థా నిక ఏఎస్‌ఐ వెంకట్‌రావుతో పాటు మరో ము గ్గురు కానిస్టేబుల్‌ సంఘటన స్థలానికి చేరుకుని అదుపుచేసేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారు లు ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌లను పక్కకు నెట్టేసి ఇసుక లారీ లపై దాడిచేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బిచ్కుంద సీఐ సాజి ద్‌ పోలీసు సిబ్బందితో సంఘ టన స్థలానికి చేరుకుని అదుపు చేసేందుకు ప్ర యత్నించగా ఆందోళ నకారులు వినకపో వడంతో పోలీసు లు లాఠీలకు పని చెప్పారు. లాఠీచా ర్జి చేసి ఆందోళన కారులను చెదరగొ ట్టారు. విషయం తె లుసుకున్న బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి సైతం సంఘటన స్థలానికి చేరుకు ని ఆందోళన కారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి అదు పులోకి వచ్చింది. అనంతరం ఘటనా స్థలిని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

Updated Date - 2020-12-29T05:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising