ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్నాకు ఉపాధ్యాయులు తరలిరావాలి

ABN, First Publish Date - 2020-12-28T05:38:31+05:30

ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బదిలీలు, అప్‌గ్రేడ్‌, పండిత్‌, పీఈటీ పోస్టులలో వెంటనే పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చే స్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లో జాక్టో, యూపీఎస్‌సీ తలపెట్టిన మహాధర్నాకు త రలిరావాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌ పి లుపునిచ్చారు.

మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డిటౌన్‌, డిసెంబరు 27: ఆరు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న  బదిలీలు, అప్‌గ్రేడ్‌, పండిత్‌, పీఈటీ పోస్టులలో వెంటనే పదోన్నతులు చేపట్టాలని డిమాండ్‌ చే స్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లో జాక్టో, యూపీఎస్‌సీ తలపెట్టిన మహాధర్నాకు త రలిరావాలని ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌నాయక్‌ పి లుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశం లో ఆయన మాట్లాడారు. సంవత్సరాలు గడుస్తున్నా బదిలీలు, పదోన్నతులు చేపట్ట కుండా ప్రభుత్వం చేస్తున్న అలసత్వంపై నిరసన తెలిపేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఐఆర్‌, పీఆర్‌సీ, డీఏలను ప్రకటించి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్క రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సం తోష్‌, ఉపాధ్యాక్షుడు శ్రీశైలం, రాజకుమార్‌కిషన్‌, సత్యం, పీడీసాయిమౌర్య, గోపాల్‌ కిషన్‌, రాము, నర్సింలు, తిరుపతి, లింగం తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising