ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ విద్యార్థిపై శ్రద్ధ చూపాలి: డీఈవో

ABN, First Publish Date - 2020-03-14T18:43:53+05:30

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 12751 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని, పరీక్షలకు అన్నీ చే సినట్లు డీఈవో రాజు తెలిపారు. శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రం లోని జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీర్కూర్‌, మార్చి 13: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 12751 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని, పరీక్షలకు అన్నీ చే సినట్లు డీఈవో రాజు తెలిపారు. శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రం లోని జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలను ఆయన పరిశీలించారు. పదో తరగతి పరీక్ష ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి, పదవ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. పాఠ్యాం శాలు పూర్తయ్యాయా? ఏమైనా సమస్యలున్నాయా? అని ఆయన వి ద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళన కు గురికాకుండా, పరీక్షలు రాయాలని అన్నారు. బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌ ఉమ్మడి మండలాల్లో 535 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవోకు ఎంఈవో వివరించారు. బీర్కూర్‌లో 256 మంది, నస్రుల్లాబాద్‌లో 279 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న ట్లు తెలిపారు. ప్రతీ విద్యారిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని, నూటికి నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద యం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలో ప్రత్యేక తరగతులు నిర్వహిం చి, వెనుకబడిన విద్యార్థులకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంఈవో నాగేశ్వర్‌రావు, పాఠశాలల ఉపా ధ్యాయులు తదితరులున్నారు. 

Updated Date - 2020-03-14T18:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising