ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా: షాపులు తెరిచాక మొబైల్ కొనిస్తానని ఆ తండ్రి చెప్పినా..

ABN, First Publish Date - 2020-04-02T17:02:25+05:30

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్థాపం చెంది పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య


కామారెడ్డి, ఏప్రిల్‌ 1: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని మనస్థాపం చెంది పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామం లో చోటు చేసుకుంది. స్థానికులు, దేవునిపల్లి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమల్లా రెడ్డి గ్రామానికి చెందిన ముదాం సిద్ధిరాములు-లత దంప తుల కుమారుడు ముదాం ప్రశాం త్‌(16) పదవ తరగతి చదువుతున్నాడు. తండ్రిని సెల్‌ఫోన్‌ కొనివ్వాలని కోరడంతో పదవ తరగతి పరీక్షలు అయిన తరువాత కొనిస్తానని చెప్పడంతో ఊరుకున్నాడు.


పదవ తరగతి పరీక్షలు వాయిదా పడడంతో మళ్లీ సెల్‌ఫోన్‌ కొనివ్వాలని ప్రశాంత్‌ తన తండ్రిని అడగడంతో కరోనా వైరస్‌ నేపథ్యంలో షాపులు తెరిచి ఉండటం లేదని దుకాణాలు తెరిచిన అనంతరం కొనిస్తానని చెప్పడంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్‌ తమ వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్నట్లు దేవునిపల్లి ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుప త్రికి తరలించినట్లు ఆయన వివరించారు.

Updated Date - 2020-04-02T17:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising