రైతుబంధు నిధుల విడుదల
ABN, First Publish Date - 2020-12-29T05:42:51+05:30
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యా సంగి సీజన్ కోసం రైతుబంధు నిధులు వి డుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రైతు ల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నుంచి జ మ అవుతున్నాయి.
రైతుల ఖాతాలలో జమ
నిజామాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యా సంగి సీజన్ కోసం రైతుబంధు నిధులు వి డుదలయ్యాయి. నిజామాబాద్ జిల్లా రైతు ల బ్యాంకు ఖాతాల్లో సోమవారం నుంచి జ మ అవుతున్నాయి. మొదట ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు రైతుబంధును జమచేస్తున్నారు. విడదత వారీగా జనవరి చివ రి వరకు అందరు రైతులకు అందే విధంగా ఏర్పాట్లు చేశారు. మొదట చిన్న, సన్నకా రు రైతులకు అందిన తర్వాత మిగతా రైతులకు అందించనున్నారు. గత వానాకాలం లాగానే ప్రస్తుతం కూడా ఈ రైతుబంధు ను విడుదల చేస్తున్నారు. ప్రభుత్వం రైతు ల పెట్టుబడి కోసం రైతుబంధు పథకాన్ని రెండేళ్లుగా కొనసాగిస్తోంది. ఎకరాకు మొద ట ఒక పంటకు రూ.4 వేలు ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం రూ.5వేలను అందజేస్తోంది. సంవత్సరంలో రెండు పంటల కోసం పది వేల రూపాయలను ఎకరాకు విడుద ల చేస్తున్నారు. వానాకాలం పంటలకు వి డుదల చేసిన విధంగానే సోమవారం నుం చి యాసంగి పంటలకు పెట్టుబడి కోసం రైతుబంధును విడుదల చేస్తున్నారు. రైతుల ఖాతలో ట్రెజరీ ద్వారా జమచేస్తున్నారు. జిల్లాలో రైతుబంధు కింద అర్హులైన రైతుల ందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న వారికి వ్యవసాయ శాఖాదికారులు ఈ రైతుబం ధు పథకం కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చే శారు. జిల్లాలో మొత్తం 440 రెవెన్యూ గ్రా మాల పరిధిలోని రైతులకు ఈ రైతుబంధు అందుతుంది. మొత్తం ఈ యాసంగిలో 2,55,620 మందికి ఈ రైతుబంధు అంద నుంది. ఎకరాకు అయిదు వేల చొప్పున 271.25 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిన విధంగానే విడతల వారీగా ఈ రైతుబంధు నిధులను జమ చేస్తున్నారు. మొదట అర ఎకరం ఉన్న వారికి అందిస్తున్నారు. విడతల వారీగా ఎకరం, ఎకరంన్న ర, రెండెకరాలు ఆపైన విడతల వారీగా గ త వానాకాలంలాగానే ట్రెజరీల ద్వారా ఈ రైతుబంధు డబ్బులను జమచేయనున్నా రు. ప్రభుత్వ ఆదేశాలతో మొదటి రోజు రైతుల ఖతాల్లో డబ్బులను జమచేశారు. మిగతా వారికి కూడా అందనున్నాయి. ప్రభుత్వ ఆదే శాలకు అనుగునంగా రైతుబం ధు కింద డబ్బులను రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారని జి ల్లా వ్యవసాయాధికారి గోవిం ద్ తెలిపారు. విడతల వారీగా డబ్బులు జమచేస్తారని ఆయ న తెలిపారు. వానాకాలం లా గానే జనవరి చివరి లోపు అం దరు రైతుల ఖాతాల్లో డబ్బు లు జమ అవుతాయన్నారు.
Updated Date - 2020-12-29T05:42:51+05:30 IST