‘నియంత్రిత సాగు పద్ధతి ఎంతో మేలు’
ABN, First Publish Date - 2020-06-01T09:46:05+05:30
నియంత్రిత సాగు పద్ధతి ఎంతో మేలని, రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని బోధన్ ఎంపీడీవో
బోధన్ మండలంలో నిర్వహించిన సమావేశంలో
ఎల్లారెడ్డి రూరల్/బాన్సువాడ/ఇందల్వాయి/బోధన్‌రూరల్, మే 31: నియంత్రిత సాగు పద్ధతి ఎంతో మేలని, రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని బోధన్ ఎంపీడీవో సుదర్శన్ అన్నారు. ఆదివారం ఊట్‌పల్లితో ప లు గ్రామాల్లో సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధిక లాభాలు వచ్చే పత్తి, సోయా, వరి తదితర పంటలు వేయాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయంపై రైతు అవగాహన సదస్సులో భాగంగా ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డీసీఎంఎస్ చైౖర్మన్ సంబరి మోహన్, ఎంపీపీ రమేష్‌నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డిమాండ్ ఉన్న పంటలను సాగుచేస్తే రైతులు ఆర్థి కంగా బలోపేతమయ్యే అవకాశాలున్నాయన్నారు. తాను పండించిన పం టలకు ధర నిర్ణయించుకునే స్థాయికి రైతులు రావాలని, వారిని ఈ స్థా యికి తీసుకవచ్చేందుకే సీఎం కేసీఆర్ నియంత్రిత పంటల విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. పంట మార్పిడి చేస్తేనే వ్యవసాయదారుడికి లాభసాటిగా ఉంటుందన్నారు. ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనా లు, ఎరువుల విషయాన్ని రైతులకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, సర్పంచ్ విజయ, ఉపసర్పంచ్ బాబు చరణ్, ఏఈవో, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని బుడ్మి గ్రామంలో పంట ల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్ మాట్లాడుతూ.. రైతాంగాన్ని లాభసాటిగా తీసుకెళ్లేందు కు సీఎం కేసీఆర్ నియంత్రిత సాగు పద్ధతిని తీసుకొని వచ్చారన్నారు. సన్నరకం పండించాలని, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలకే ప్రాధా న్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ నాందేవ్, ఎంపీటీసీ రుక్మిణి రవి, గోపాల్ రెడ్డి, బలరాం, కమ్రోద్దీన్, ఏఈవో గోపాల్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూరు, సో మర్యాఘడ్ తండాల్లో రైతులకు అవగాహన కల్పించారు. ఎల్లారెడ్డి, మత్త మాల, వెల్లుట్ల సహకార సంఘాల్లో వర్షాకాలంలో వరి విత్తనాలు అం దుబాటులో ఉన్నాయని ఎల్లారెడ్డి సొసైటీ చైర్మన్ ఎగుల నర్సింలు తెలి పారు. బీపీటీ ముల్కనూర్ 25 కిలోల బస్తా ధర రూ.780, 1010 దొడ్డు రకం 30 కిలోల బస్తా ధర రూ.860, సారంగపూర్ తెలంగాణ 30 కిలోల బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కావాల్సిన వారు ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్‌బుక్ జిరాక్స్‌తో రావాలని తెలిపారు.
Updated Date - 2020-06-01T09:46:05+05:30 IST