టోల్‌ప్లాజా వద్ద బీజేవైఎం నాయకుల రాస్తారోకో
ABN, First Publish Date - 2020-12-30T04:48:57+05:30
బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
ఇందల్వాయి, డిసెంబరు 29: బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ గత ఎన్నికల హామీల్లో నిరుద్యోగులకు ఉపాధి కోసం భృతి కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచిపోయారని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల్లో గెలిస్తే నిరుద్యోగులకు రూ.3 వేల భృతిపాటు ఇంటికొక ఉద్యోగం కల్పిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రహదారిని దిగ్బంధం చేయడంతో బీజేవైఎం నాయకులను చెదరగొట్టిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి డిచ్‌పల్లి, ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.
Updated Date - 2020-12-30T04:48:57+05:30 IST