ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్రయమిచ్చినందుకు అంతమొందించారు

ABN, First Publish Date - 2020-10-04T10:28:16+05:30

ఆశ్రయమిచ్చినందుకు సొంత అక్క కొడుకే తన చిన్నమ్మను దారుణంగా హత్య చేశాడని బోధన్‌ ఏసీపీ రామారావు తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హత్య కేసును ఛేదించిన పోలీసులు


బోధన్‌ రూరల్‌, అక్టోబరు 3: ఆశ్రయమిచ్చినందుకు సొంత అక్క కొడుకే తన చిన్నమ్మను దారుణంగా హత్య చేశాడని బోధన్‌ ఏసీపీ రామారావు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం సాయంత్రం విలేకరులతో మాట్లాడు తూ, గత నెల 13వ తేదీన బోధన్‌ ఆటోనగర్‌ ఏరియాకు చెందిన షన్నుబేగం (25)ను ఆమె అక్క కొడుకు నభిఖురేషి, ఆతని భార్య పకడ్బందీ ప్రణాళికతో మెడకు వైరు చుట్టి చంపేశారన్నారు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి అర కిలోమీటరు దూరంలోని పంటపొలాల్లో పడేశారని వివరించారు. నభిఖురేషి మైనర్‌ బాలికను వివాహం చేసుకుని తన చిన్నమ్మ అయిన షన్ను బేగం ఇంట్లో ఆశ్రయం పొందాడు. మీరు వేరే చోటికి వెళ్లిపోవాలని, ఇక్కడ ఉండొద్దని ఆమె హెచ్చరించడంతో నభిఖురేషి ఆమెను ప్రణాళికతో అంత మొందించాడన్నారు. షన్నుబేగం మృతదేహాన్ని ఆమె అక్క గుర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి నబిఖురేషి, ఆతని భార్యను జిల్లా కేంద్రంలో చాకచక్యంగా పట్టుకుని విచారించగా, హత్య చేసిన తీరును వెల్లడించారని, ఈ మేరకు వారిని రిమాండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో బోధన్‌ సీఐ పల్లె రాకేష్‌, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - 2020-10-04T10:28:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising