ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీ రెసిడెన్షియల్‌లో అక్రమ నియామకాలు రద్దుచేయాలి

ABN, First Publish Date - 2020-11-29T05:57:23+05:30

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అక్రమ నియామకాలు రద్దుచేసి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ డిమాండ్‌
నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 28: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో అక్రమ నియామకాలు రద్దుచేసి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం మైనార్టీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎటువంటి నోటిఫికేషన్‌ లేకుండా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 18 మైనార్టీ గురుకులాల్లో దాదాపు 56 టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ పోస్టులు భర్తీచేశారని, ఇందులో ప్రజాప్రతినిధుల బంధువులున్నారని ఆరోపించారు. ఒకవైపు నిరుద్యోగం పెరిగిపోతుండగా, మరోవైపు అక్రమ నియామకాలు జరపడం అన్యాయమన్నారు. అక్రమ నియామకాలపై విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయికృష్ణ, భాస్కర్‌, ప్రేమ్‌చంద్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:57:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising